accident రోడ్డు దాటుతున్న మహిళలు ..అకస్మాత్తుగా కారు ఢీ ..అక్కడికక్కడే..

రంగారెడ్డి జిల్లాలో దారుణం

accident: ముగ్గురు మహిళలు దారుణంగా మృత్యువాత పడ్డారు. డ్రైవర్ అజాగ్రత్త వల్ల అక్కడికక్కడే తనువు చాలించారు. కూలిపనులు చేసుకుని రోడ్డుదాటుతున్న వారిని కారు ఒక్కసారిగా వచ్చి కబలించివేసింది.

  • Share this:
ముగ్గురు మహిళలు దారుణంగా మృత్యువాత పడ్డారు. డ్రైవర్ అజాగ్రత్త వల్ల అక్కడికక్కడే తనువు చాలించారు. కూలిపనులు చేసుకుని రోడ్డుదాటుతున్న వారిని కారు ఒక్కసారిగా వచ్చి కబలించివేసింది. దీంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

రంగారెడ్డి జిల్లా నందిగామ జాతీయ రహదారి చాలివేంద్ర గూడ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళా కార్మికులను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి మహిళలను ఢీ కొట్టింది. దీంతో మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు...కాగా తెలంగాణ రెండు రోజుల క్రితమే మద్యం మత్తులో వాహనం నడిపి నలుగురిని పొట్టనబెట్టుకున్నారు. జాతియ రహాదారులు అయినా ..రహాదారులురక్తసిక్తమవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న డ్రైవర్ల నిర్లక్ష్యం , మద్యం సేవించి వాహానాలు నడపడంతో ప్రమాదాలకు అవకాశాలు ఏర్పాడుతున్నాయి.ప్రమాద స్థలంలో అంబులెన్సులు
Published by:yveerash yveerash
First published: