హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: 3.5 కోట్ల రూపాయల హవాలా మనీ పట్టివేత .. మునుగోడు తరలించేందుకేనా అనే అనుమానాలు

Hyderabad: 3.5 కోట్ల రూపాయల హవాలా మనీ పట్టివేత .. మునుగోడు తరలించేందుకేనా అనే అనుమానాలు

hawala money(file)

hawala money(file)

Hyderabad | Hawala money: హైదరాబాద్‌లో భారీగా హవాల మనీ పట్టుబడింది. మంగళవారం గాంధీనగర్‌లో 3.5కోట్ల హవాలా మనీని పట్టుకున్నారు టాస్క్‌ఫోర్స్ అధికారులు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో భారీగా హవాల మనీ పట్టుబడింది. మంగళవారం గాంధీనగర్‌(Gandhinagar)లో 3.5కోట్ల హవాలా మనీని పట్టుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Task Force Police). దీంతో గడిచిన మూడ్రోజుల వ్యవధిలోనే సుమారు ఏడు కోట్ల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే మునుగోడు(Munugodu) ఉపఎన్నికల నేపధ్యంలో వరుసగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంతో పాటు జిల్లా బోర్డర్‌లలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎవరి నుంచి ఎవరికి ఇంత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతోందనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Munugodu By-Poll: రాజగోపాల్ రెడ్డికి ఊహించని షాక్..రాత్రికి రాత్రే మునుగోడులో వెలసిన పోస్టర్లు

మూడున్నర కోట్ల హవాల మనీ ..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హవాలా మనీ కట్టలు కట్టలుగా పట్టుబడుతోంది. గాంధీనగర్‌లో రెండు స్విఫ్ట్ కార్లలో సైదాబాద్‌కు నోట్ల కట్టల్ని తరలిస్తున్నట్లుగా సమాచారం అందుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల్ని తనిఖీ చేశారు. రెండు స్విఫ్ట్ కార్లలో 3.5కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును సైదాబాద్‌లో ఉంటున్న బాలరాజుగౌడ్ అనే వ్యక్తికి అప్పగించాలని కొందరు వ్యక్తులకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. హవాల మనీతో ఉన్న కార్లను గాంధీనగర్‌లో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు..నగదుతో పాటు రెండు కార్లను సీజ్ చేశారు. కార్లలో నగదు తరలిస్తూ పట్టుబడిన ఆరుగురిని పోలీసులకు అప్పగించారు.

ఎవరూ బాలరాజుగౌడ్..

సైదాబాద్‌కు చెందిన బాలరాజు గౌడ్ ఎవరూ..? అతనికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపిన వ్యక్తి ఎవరూ అనే విషయంపై గాంధీ నగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బును ఎందుకోసం తీసుకొచ్చారు. బాలరాజు గౌడ్ అనే వ్యక్తి ద్వారా ఇంకా ఎవరికైనా ఈ డబ్బులు చేరాల్సి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మునుగోడు ఓటర్లకు పంపిణి చేయడానికి ఈ డబ్బులు తీసుకెళ్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

మూడ్రోజుల్లో 7కోట్లు పట్టివేత..

మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలోనే ఇంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు చేతులు మారుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేవలం మూడ్రోజుల వ్యవధిలోనే 7.3కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మునుపెన్నడు లేనంతగా పెద్ద మొత్తంలో హవాలా మనీ పట్టుబడటంతో అధికారులు వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

Crime news: ఆ చెడు అలవాటు వల్లే కొడుకును చంపిన తల్లిదండ్రులు .. ఈ దారుణం ఎక్కడ జరిగిందంటే..

ధనప్రవాహం పారిస్తోంది ఎవరూ..?

మునుగోడు బైపోల్‌ కోసం ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు. మరోవైపు స్థానిక ఓటర్లను ప్రలోభపెడుతున్నారని టీఆర్ఎస్‌ నాయకుల ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే ..కాదు బీజేపీ అభ్యర్ధి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారంటూ కాంట్రాక్ట్‌పే అంటూ పోస్టర్లు అంటించడంతో ఉపఎన్నిక ఉత్కంఠగా మారుతోంది.

First published:

Tags: Hyderabad, Money, Telangana crime news

ఉత్తమ కథలు