హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad |Dengue : వెన్నులో వణుకుపుట్టిస్తున్న డెంగ్యూ కేసులు .. ఇన్‌పేషెంట్లుగా మారుతున్న బాధితులు

Hyderabad |Dengue : వెన్నులో వణుకుపుట్టిస్తున్న డెంగ్యూ కేసులు .. ఇన్‌పేషెంట్లుగా మారుతున్న బాధితులు

DENGUE CASES(FILE PHOTO)

DENGUE CASES(FILE PHOTO)

HYDERABAD | DENGUE: హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు తెలియకుండానే కొత్త అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. నగరంలోని చాలా మంది జ్వరం, ఒళ్లు, తలనొప్పుల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్లకు చూపించుకునేందుకు వెళ్లి ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. కారణం అదేనని చెబుతున్నారు వైద్యులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో నివసిస్తున్న ప్రజలకు తెలియకుండానే కొత్త అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరోనా(Corona) నుంచి పూర్తి కోలుకున్నాం కదా అని ఫ్రీగా తిరగడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోవడమో తెలియదు కాని ..వేల సంఖ్యలో ఆసుపత్రు(Hospital)లకు వెళ్తున్నారు. వెళ్లిన వాళ్లో చాలా మంది ఇన్‌పేషెంట్స్‌Inpatientsగా మారుతున్నారు. నగరంలోని చాలా మంది జ్వరం, ఒళ్లు, తలనొప్పుల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లడంతో డాక్టర్లు డెంగ్యూ లక్షణాలు(Dengue Symptoms)గా తేల్చి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇలా డెంగ్యూ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ(Medical and Health Department),జీహెచ్‌ఎంసీ (GHMC) నగరప్రజల్ని అప్రమత్తం చేస్తోంది.

Telangana: మద్యం మత్తులో రోడ్డుపై రచ్చ చేసిన మహిళ .. రెండో భర్త అలా చేస్తున్నాడనే బాధతో..

వేల సంఖ్యలో హాస్పిటల్‌లో అడ్మిట్ ..

నగరంలో కొద్ది రోజులుగా వర్షాలు కురవడం, పరిసరాల శుభ్రత లోపించడం కారణంగానో హైదరాబాద్‌లో వేలాది మంది డెంగ్యూ బారినపడుతున్నట్లుగా తెలుస్తోంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కలిగి ఉండటతో డెంగ్యూ బారినపడినట్లుగా నిర్ధారిస్తున్నారు వైద్యులు. దీంతో చాలా మందికి రక్ష పరీక్షలు నిర్వహించడంతో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. డెంగ్యూ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వాళ్లలో చాలా మందిలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోతుందని అందుకే హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అలా చేరిన వాళ్లకు నాలుగైదు రోజులు ట్రీట్‌మెంట్ పొంది నార్మల్ కండీషన్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. ప్రస్తుతానికి కేవలం రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోనే ఈ డెంగ్యూ విజృంభణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈసంవత్సరం ఇప్పటి వరకు చూసుకుంటే హైదరాబాద్‌లోనే డెంగ్యూ లక్షణాలతో ప్లేట్‌లెట్స్‌ తగ్గడం వల్లే ఆసుపత్రిలో చేరిన వాళ్ల సంఖ్య మూడు వేలకు చేరుకుంది.

అందుబాటులో రాపిట్స్‌ కిట్స్..

డెంగ్యూ సిటీలో ప్రమాదఘంటికలు మోగిస్తున్న నేపధ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, తల, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలతో బాధపడే వాళ్లలో డెంగ్యూ నిర్ధారణ కోసం రాపిడ్ కిట్స్‌ లను అందుబాటులో ఉంచారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్తీ దవఖానాల్లో కూడా వీటిని అందుబాటులో ఉంచి టెస్ట్‌లు చేస్తున్నారు. అయితే అధికారుల అప్రమత్తంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. అన్నీ జ్వరాలను డెంగ్యూ జ్వరాలుగా భావించవచ్చని సూచిస్తున్నారు.

Telangana : పందులు చేనులోకొస్తే మనుషులకు పనిష్మెంట్ .. ఇదెక్కడి న్యాయం సీఎం గారు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్

డెంగ్యూ లక్షణాలు ఇవే..

తీవ్రమైన జ్వరం, తలనొప్పి అధికంగా ఉండటం, కంటి లోపలి భాగంలో నొప్పి, వాంతులు, విరోచనాలు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, దంతల చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు ఉంటేనే డెంగ్యూగా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. సాధారణ జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్స్‌ని జ్వరం తగ్గే వరకు వేసుకోవాలని జ్యూస్‌ ఎక్కుగా తాగాలని అధికారులు సూచిస్తున్నారు. దోమలు రాకుండా ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ..ఇంట్లో మస్కిటో కాయల్స్‌ ఉపయోగిస్తే మంచిదని తగిన సూచనలు చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Dengue fever, Hyderabad news

ఉత్తమ కథలు