హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: కళ్లలో కారం కొట్టి కత్తితో దాడి .. 14తులాల గోల్డ్ ఎత్తుకెళ్లిన కేటుగాడు..ఎక్కడ జరిగిందంటే

OMG: కళ్లలో కారం కొట్టి కత్తితో దాడి .. 14తులాల గోల్డ్ ఎత్తుకెళ్లిన కేటుగాడు..ఎక్కడ జరిగిందంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OMG: సికింద్రాబాద్‌లో సినీ ఫక్కీలో ఓ దారి దోపిడీ జరిగింది. నగల షాపులో పని చేస్తున్న వ్యక్తి కళ్లలో కారం కొట్టి నగలు ఎత్తుకెళ్లాడో దుండగుడు. కత్తితో గాయపరిచి నగలు ఎత్తుకెళ్లిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గ్రేటర్ హైదరాబాద్‌(Hyderabad)లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే సామాన్యులను టార్గెట్‌గా చేసుకొని వృద్ధులు, మహిళల మెడలో నగలు లాక్కెళ్తున్న చైన్ స్నాచర్స్‌ గురించే ఇప్పటి వరకు విన్నాం. కాని సికింద్రాబాద్‌(Secunderabad)లో ఓ నగల షాపులో పని చేస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కళ్లలో కారం చల్లి అటుపై కత్తితో పొడిచి గాయపరిచాడు. అనంతరం అతని దగ్గరున్న 14తులాల బంగారు (14 Tola gold jewellery)నగల్ని లాక్కొని పారిపోయాడు. సినిమా ఫక్కీలో దోపిడీకి పాల్పడిన నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Shocking News: ఎద్దు మూత్ర విసర్జన చేసిందని యజమానికి శిక్ష .. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

సిటీలో దారి దోపిడీ ...

జంటనగరాల్లో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోమవారం రాత్రి సికింద్రాబాద్ సిటీ లైట్ హోటల్ దగ్గర పవన్‌ అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు. హిమాయత్‌నగర్‌లోని రాధే జ్యూవెలరీ షాప్‌కు చెందిన పవన్ 14తులాల బంగారు నగలు తీసుకొని సికింద్రాబాద్‌ వస్తుండగా ఓ ఆగంతకుడు సిటీలైట్‌ హోటల్ దగ్గరకు చేరుకోగానే అటాక్ చేశాడు. పవన్ కళ్లలో కారం కొట్టి కత్తితో పొడిచాడు. వెంటనే అతని దగ్గరున్న 14తులాల గోల్డ్ ఆర్నమెంట్స్‌ని తీసుకొని పారిపోయాడు దుండగుడు.

కళ్లలో కారం చల్లి..

గాయపడిన పవన్ గట్టిగా అరవడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు బాధితుడు పవన్‌ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నగలు తీసుకొని పారిపోయిన నిందితుడ్ని పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా దాడి చేసిన ప్రదేశంలోని సీసీ ఫుటేజ్‌తో పాటు హిమాయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు నిందితుడు ఏ ఏ మార్గాల్లో వచ్చే అవకాశం ఉందో వాటి ఫుటేజిని చెక్ చేస్తున్నారు.

Telangana: దుబ్బాక నియోజకవర్గంపై కన్నేసిన TRS ఎంపీ .. ఈసారైనా ఆయన కోరిక తీరేనా ..?

14తులాల గోల్డ్ ఎత్తుకెళ్లిన దొంగ..

ఓ జువెలరీ షాపుకు చెందిన వ్యక్తిపై దారి దోపిడీ జరిగిన తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎవరో ముందుగానే పథకం వేసుకొని చేసిన నేరంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుడ్నిపట్టుకునేందుకు అన్నీ పోలీస్ స్టేషన్‌లను అలర్ట్ చేశారు.

First published:

Tags: Murder attempt, Telangana crime news

ఉత్తమ కథలు