HYDERABAD THESE ARE THE STRONG SECURITY ARRANGEMENTS MADE IN THE WAKE OF PRIME MINISTER NARENDRA MODI VISIT TO HYDERABAD BK PRV
PM Narendra Modi: ప్రధాని హైదరాబాద్ పర్యటనకు ఆల్ సెట్.. భద్రతా ఏర్పాట్లు చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది.
హైదరాబాద్, ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకి (BJP National Executives meeting) హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటనకు ఏర్పాటు చేసిన భద్రత చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది.
జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ (HICC) నోవాటెల్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకి (BJP National Executives meeting) హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటన (Hyderabad tour)కు ఏర్పాటు చేసిన భద్రత (Security) చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. మోదీ నగరంలో అడుగు పెట్టినప్పటి నుంచి మళ్లీ నగరం నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రధాని పర్యటించే మార్గం మొత్తం జల్లడపడుతున్నారు భద్రతా అధికారులు. గతంలో ఎన్నడు లేని విధంగా మూడెంచల భద్రతా ఏర్పాట్లు చేశారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (Cyberabad CP) ఎం.స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) గురువారం అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధానమంత్రి పర్యటన వివరాలు, ఆయన రాక, బస, నిష్క్రమణ దాంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఆకస్మిక చర్యలకు సంబంధించిన వివరాలు అధికారులతో చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో మోదీ పర్యటనకు ఈ సారి భద్రతను కల్పిస్తున్నారు అధికారులు.
రోజూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు..
మోదీ నగరానికి చేరుకోవడానికి ఒక రోజు ముందే ఆయన ప్రయాణించే మార్గం మొత్తం అధికారులు ఆధీనంలోకి తీసుకొనున్నారు. దీంతో పాటు మోదీ బస చేసి హోటల్ ను కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తీసుకోనున్నారు. ‘‘ప్రధాని పర్యటన నేపథ్యంలో రోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నాం, పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మోహరించాం, అదనపు బందోబస్తును సిద్ధంగా ఉంచడమే కాకుండా క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం”అని అధికారులు చెప్పారు.
స్నిపర్ల మోహరింపు, బాంబ్ డిస్పోజబుల్ సిస్టమ్, రూఫ్-టాప్ వాచ్, మఫ్టీ పార్టీలు, రూట్ మ్యాప్, ట్రయల్ రన్ మొదలుగు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రధానమంత్రికి రక్షణగా ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌తో సహా అన్ని శాఖల అధికారులతో అనుసంధానం చేసేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనలో ఏదైనా ఆకస్మిక నిరసనలు మరియు సంఘటనలను ఎదుర్కోవటానికి విస్తృతమై ఏర్పాట్లు చేశారు.
రూప్ టాప్ వాచ్..
ఆయన ప్రయాణించే మార్గం మొత్తం రూప్ టాప్ వాచ్ ఉండటమే కాకుండా ఆ ప్రాంతం మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంటుంది. ఆయన ప్రయాణించిన మార్గంలో ఎక్కడా ఆయన కాన్వయ్ కి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని పర్యటన ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నాం అని మీడియాకు కమిషనర్ చెప్పారు. వేదిక వద్ద కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ప్రతి విభాగం నుంచి ఒక సీనియర్ అధికారి ఉంటారని, ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్స్‌లతో పాటు శస్త్ర చికిత్సకు ఉపయోగపడే పరికరాలను వేదికల వద్ద ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను కోరామని కమిషనర్ చెప్పారు.
మరో వైపు మోదీ పర్యటన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది ఇప్పటికే అధికారపార్టీ నేతలు మోదీ పర్యటలో తమ నిరసన తెలపడానికి రెడీ అవుతున్నారు. పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా మోదీ పర్యటనలో తమ వాణి వినిపించడానికి ప్రయత్నాలు చేస్తోన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద గతంలో ఎన్నడు లేదని విధంగా మోదీకి పర్యటకు భద్రత ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.