Home /News /telangana /

HYDERABAD THESE ARE THE SPECIALITIES OF POLICE COMMAND CONTROL SYSTEM IN HYDERABAD PRV

Police command control center: హైదరాబాద్​లో కమాండ్​ కంట్రోల్​ సిస్టం.. ఈ పోలీస్​ టవర్స్​ ప్రత్యేకతలేంటి?.

command control center ( కమాండ్​ కంట్రోల్​ సెంటర్)

command control center ( కమాండ్​ కంట్రోల్​ సెంటర్)

తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ (KCR)ప్రారంభించారు. అయితే ఈ పోలీస్ టవర్స్​ ప్రత్యేకతలు ఏంటి?

  తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(Inaugurated Police Command Control Center)ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో అత్యంత పకడ్బందీగా దీన్ని నిర్మించడం జరిగింది. ఆరేళ్ల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న ఐకానిక్ భవనాన్ని గురువారం (Thursday)మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన ప్రారంభించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ నిర్మించడం జరిగింది. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భవన సముదాయం ఐదు టవర్ల రూపంలో నిర్మించారు.

  అద్భుత నిర్మాణం..

  18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. 7 ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 83.5 మీటర్లు. టవర్‌ ఏ లోని 18వ ఫ్లోర్‌లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఉంది. 14, 15వ ఫ్లోర్‌లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో సీఎస్‌, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. టవర్‌ బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్‌కు కేటాయించారు.సాంకేతిక పరిజ్ఞానం వాడుకునే దిశగా 5 టవర్లు(ఏబీసీడీఈ) ఏర్పాటు చేశారు.

  ఈ పోలీస్​ టవర్స్​ ఎందుకంత ప్రత్యేకం.. అందులోని విశేషాలను ఒకసారి తెలుసుకుందాం..

  పోలీసు సింగిల్‌ విండో..

  నగర కమిషనరేట్‌ పరిధిలోని టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ బ్రాంచ్‌, శాంతిభద్రతలు, సీసీఎస్, .. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్‌ విండో విధానం అమలుకానుంది.  ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టం:

  అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ–టీమ్స్, డయల్‌– 100 ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంటాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం స్పందించేలా కంప్యూటర్‌ ప్రొగ్రామింగ్‌ ఉండనుంది. దాదాపు లక్ష సీసీ కెమెరాలను ఒకే తెరపై చూసేలా బాహుబలి తెరలను కూడా ఏర్పాటు చేశారు.

  ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి..

  టీఎస్‌ఐసీసీసీలో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవి తక్కువ సమయంలో అందరికీ చేరడం అదనపు ఆకర్షణలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్‌ స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనికోసం ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి.

  సిటిజన్‌ పిటిషన్‌ మేనేజ్‌మెంట్‌..

  ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని విభాగాల వారీగా కేటాయిస్తారు, సత్వర స్పందన, పరిష్కారం జరుగుతుంది. వీటి మ్యాపింగ్‌ మొత్తం కంప్యూటర్‌ ద్వారా జరుగుతుంది. మార్కెట్, సోషల్‌ మీడియా విశ్లేషణ, మెబైల్‌ యాప్స్‌ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో  ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్‌ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రత్యేక ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్స్‌ ద్వారా శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేస్తారు జీపీఎస్‌ పరిజ్ఞానం ఉన్న వాహనాలను అవసరమైన చోటుకు మళ్ళిస్తారు.

  ట్రాఫిక్‌ కష్టాలకు చెక్​..

  నగరంలో ట్రాఫిక్‌ నిర్వహణకూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. సెన్సర్ల ద్వారా వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి మార్పు చేర్పులు సూచిస్తారు. ఆర్టీఏ డేటాబేస్‌–అనుమానిత వాహనాల డేటాబేస్‌లను అనుసంధానిస్తారు. తక్షణ స్పందన కోసం ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ ఉంటాయి.

  క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సిస్టం (Crime and Criminal Tracking sytsem).. 

  ఎఫ్‌ఐఆర్‌ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్‌ మ్యాపింగ్, నేరగాళ్ల డేటాబేస్‌ నిర్వహణ,  అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్‌ ఇన్వెస్టిగేషన్‌ లాబ్‌ ఇతర టూల్స్‌ నేరాల నిరోధం, కేసుల సత్వర పరిష్కారానికి ఉపయోగపడనుంది.

  నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌..

  అంతేకాకుండా నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ఎనలటికల్‌ టూల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్స్‌ సెర్చ్‌కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్‌ డిజైనింగ్‌ టూల్స్‌తో మెరుగైన సేవలు అందించనున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad, Hyderabad police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు