Home /News /telangana /

HYDERABAD THESE ARE THE CENTERS THAT GIVE FREE COVID BOOSTER DOSE VACCINES TO PEOPLE ACROSS TELANGANA BK PRV

Free Covid Booster Vaccine: తెలంగాణ ప్రజలకు అలెర్ట్​.. ఉచిత కరోనా బూస్టర్ వ్యాక్సిన్ ఇచ్చే సెంటర్స్​​ ఇవే! 

ప్రతీకాత్మక చిత్రం)

ప్రతీకాత్మక చిత్రం)

కోవిడ్​ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ (health dpartment) ప్ర‌జ‌ల‌కు పలు సూచ‌న‌లు చేసంది. అయితే వీటితోపాటు కోవిడ్ వాక్సినేష‌న్ డ్రైవ్ కూడా చేయ‌డానికి స‌ర్వ సిధ్దం చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం

    (M. Balakrishna, News18, Hyderabad)

    కోవిడ్ (Covid) కేసులు మ‌ళ్లీ తెలంగాణ‌ (Telangana)లో పెరుగుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా గురువారం 512 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఇందులో 293 జిహెచ్‌ఎంసి (GHMC) పరిధిలో నమోదైతే, మిగిలిన‌వి ఇత‌ర జిల్లాల్లో న‌మోదైయ్యాయి.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5051 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి. అయితే ఒక వైపు కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌డం మారిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితిల నేప‌థ్యంలో సీజ‌న‌ల్ వ్యాధులు కూడా ఎక్కువ‌గానే వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర ఆరోగ్య శాఖ (health department) ప్ర‌జ‌ల‌కు జాగ్ర‌త్త‌ల‌కు సంబంధించి పలు సూచ‌న‌లు చేసింది. అయితే వీటితోపాటు కోవిడ్ వాక్సినేష‌న్ (Covid Vaccination drive) డ్రైవ్ కూడా చేయ‌డానికి స‌ర్వ సిధ్దం చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. శుక్ర‌వారం నుంచి 18-59 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులకు బూస్టర్ లేదా ముందుజాగ్రత్త కోవిడ్ డోస్‌లను (Covid Free Booster Vaccine) అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల‌తోపాటు ప్ర‌త్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి ఇత‌ర బహిరంగ ప్రదేశాలలో అందించ‌డానికి ప్ర‌భుత్వం సిద్దమైంది.

    ఈ కోవిడ్ వాక్సినేష‌న్ స్పెషల్ డ్రైవ్ 75 రోజుల పాటు నిర్వహించబడుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.  రెండో కోవిడ్ డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత అర్హత ఉన్న వ్యక్తులందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ (Covid Free Booster Vaccine) లు ఇవ్వ‌నున్నారు.



    కాలేజీలు, బస్టాండ్​లు..

    ప్రస్తుతం, కోవిషీల్డ్, కోవాక్సిన్‌తో సహా, తెలంగాణలో 20 లక్షల డోస్‌ల వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయి, వీటిని రాబోయే 75 రోజుల్లో ప్ర‌జ‌ల‌కు అందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు అధికారులు. హైద‌రాబాద్ (Hyderabad) లో ఉచిత కోవిడ్ డోస్ (Covid Free Booster Vaccine)  లు వేసే సెంట‌ర్స్ వివరాలు ప్రభుత్వం తెలిపింది.  బూస్టర్ డోస్ లు అన్ని PHCలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలతో సహా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలల్లో ప్ర‌త్యేక సెంట‌ర్స్ ను ఏర్పాటు చేసి ప్ర‌భుత్వం అందించ‌నుంది. బూస్టర్ డోస్ లు సికింద్రాబాద్, నాంపల్లి, కాజీపేటలోని రైల్వే స్టేషన్‌లతోపాటు MG బస్టాండ్, JBSలోని బస్ టెర్మినల్స్‌లో కూడా 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నారు అధికారులు. వీటితో పాటు ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న మెట్రో స్టేష‌న్స్, అమీర్ పేట్, కూక‌ట్ ప‌ల్లి, బేంగంపేట్, నాంప‌ల్లి, తోపాటు ఇత‌ర ప్రాంతాల్లో కూడా అధికారులు బూస్టర్​ డోస్​ కోసం ఏర్పాట్లు చేశారు.

    ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5051 యాక్టివ్ కేసులు ఉండ‌గా అందులో గురువారం రోజు 543 మంది కోలుకున్నారు, దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,99,011కి చేరుకుంది.  ఆరోగ్య శాఖ‌ గురువారం 25,287 కోవిడ్ రాపిడ్ పరీక్షలను నిర్వహించింది. ఇప్పటివరకు ఆరోగ్య శాఖ‌ 3,59,62,590 కోవిడ్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వ‌హించింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona, Corona Vaccine, Covid vaccine, Telangana

    తదుపరి వార్తలు