Home /News /telangana /

HYDERABAD THEFT ONE KG GOLD AND 20 LAKHS ROBBERY IN HYDERABAD VRY

Hyderabad : సంక్రాంతికి ముందే చోరీలు... కిలో బంగారం, 20 లక్షలు మాయం..! ఎక్కడంటే..

హైదరాబాద్ లో దొొంగతనం

హైదరాబాద్ లో దొొంగతనం

Hyderabad : సంక్రాంతికి పండగకు వెళుతున్న కుటుంబాల ఇళ్ల రక్షణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా అప్పుడే దోంగల ప్రతాపం చూపించారు.. సంక్రాంతి పండగ ముందే తాళాలు వేసిన ఇళ్లకు కన్నాలు వేసి కిలో బంగారం ఎత్తుకెళ్లారు.

    సంక్రాంతి పండగ ముందు దొంగతనాలకు పాల్పడే గ్యాంగ్ అప్పుడే తమ చేతి వాటాన్ని చూపించారు. ఇంకా పూర్తిగా ఇళ్లు విడిచి వెళ్లక ముందే నగరంలో దొంగలు పెద్ద ఎత్తున బంగారం ,డబ్బు దోచుకెళ్లారు.

    హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ లోని శ్రీ సాయి నివాస్ ప్లాట్ నంబర్ 301 లో నివాసం ఉంటున్న శేఖర్ కుటుంబం ఈ నెల పదో తేదీన ఉదయం 10 గంటలకు వాళ్ళ బంధువు మరణించడంతో ... అంత్యక్రియల కోసం వీరు ప్రకాశం జిల్లాకు కుటుంబంతో సహా వెళ్లారు... అయితే అంత్యక్రియలు నిర్వహించి, గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి చేరుకున్నారు...

    TS Politics : లాలుకు పట్టిన గతే కేసీఆర్‌కు ..! జైలు అనుభవం కోసమే తేజస్వీయాదవ్ తో భేటి..

    ఈ క్రమంలోనే ప్లాట్ మెయిన్ డోర్ తెరిచి ఉండడం కుటుంబ సభ్యులు గమనించారు.. దీంతో చుట్టు పక్కల ఫ్లాట్ యజమానులు కూడా వెళ్లి చూశారు.. కాగా వాళ్లు వెళ్లిన మరునాడే అంటే దొంగతనం జరిగినట్టు వారు గుర్తించారు.. దీంతో పన్నెండో తేదీన అర్థ రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం అయిదు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, తాళం పగుల గొట్టి కేజీ బంగారం, ఇరవై రెండు లక్షల నగదు చోరికి గురైనట్టు పిర్యాదు లో పేర్కోన్నారు.... ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు...

    Constable remand : మహిళా కానిస్టేబుల్‌‌తో క్లోజ్.. రెండు సార్లు గర్భం చేసి.. ఆ తర్వాత..!

    కాగా ఇళ్లు విడిచి ఊళ్లు వెళ్లేవారు తమ విలువైన వస్తువులు, డబ్బును బ్యాంకు లాకర్లో ఉంచి వెళ్లడంతో పాటు పోలీసులకు సైతం సమాచారం ఇవ్వాలని గత కొద్ది రోజులుగా పోలీసులు సూచిస్తున్నారు. ఇలా పోలీసులు జాగ్రత్తలు చెబతున్న క్రమంలోనే దొంగలు తమ పని కానియడం సంచలనంగా మారింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Theft

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు