Hyderabad Crime News: ఇన్ స్టాగ్రామ్ లో యువతి పరిచయం.. అర్థరాత్రి ఆమెను బయటకు రమ్మన్నాడు.. చివరకు అతడు ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతి ఇంటి నుంచి బయటకు రమ్మంటే రాలేదన్న మనస్తాపంలో భవనం పైనుంచి దూకి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధి శోభన కాలనీలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    సోషల్ మీడియాతో ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. సోషల్ మీడియాలో తెలియని వారితో పరిచయం ఏర్పరచుకొని ప్రేమించుకొని మోసపోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కొన్ని లక్షలు పోగొట్టుకొని పోలీసులకు ఆశ్రయించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇలా ఓ వ్యక్తి గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఓ రోజు అతడు ఆమె అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్లాడు. బయటకు రమ్మంటూ యవతికి మెసేజ్ పంపాడు. ఆమె అర్థరాత్రి తాను రాను అంటూ తిరిగి మెసేజ్ పంపింది. దీంతో అతడు యువతి బయటకు రాలేదని.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బాలానగర్‌లోని శోభన కాలనీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట నెహ్రూనగర్‌కు చెందిన శుభమ్‌ (26)కు బాలానగర్‌ శోభన కాలనీకి చెందిన ఓ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది.

    ఒకరికొకరు ఫోన్ నంబర్లు కూడా మార్చకున్నారు. పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఈ క్రమంలో నిన్నరాత్రి శుభమ్‌ యువతి ఇంటికి వెళ్లి ఇంటి నుంచి బయటకు రావాలని ఆమెను కోరాడు. దానికి ఆమె నిరాకరించింది. యువతి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులతో అతడు తీవ్ర వాగ్వాదానికి దిగాడు. నానాయాగీ చేసి యువతితోపాటు ఆమె తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నాడు. చివరికి అర్ధరాత్రి సమయంలో తాను బయటకు రానని యువతి తేల్చి చెప్పడంతో ప్రియుడు భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

    Read Also: ఇదెక్కడి దౌర్జన్యం.. పడుకునే మంచాన్ని జప్తు చేసి ఎత్తుకెళ్లారు.. అసలేం జరిగింది..


    Read Also: చంపి పాతేయడం ఎలా..? గూగుల్ లో సెర్చ్ చేసి మరీ.. దారుణానికి ఒడిగట్టింది.. ఏం జరిగిందంటే..


    జగద్గిరిగుట్ట నెహ్రునగర్‌కు చెందిన యువకుడు శుభం మద్యం మత్తులో యువతి ఇంటికి వెళ్లి హంగామా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా యువతి కుటుంబీకులు తన కుమారుడిని కొట్టి చంపినట్లు యువకుడి తండ్రి ఆరోపిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    Published by:Veera Babu
    First published: