Home /News /telangana /

HYDERABAD THE WOMENS ASSURANCE CENTER RECEIVES COMPLAINTS FROM HUSBANDS VB

Cyberabad: సార్.. నా భార్య వేధిస్తోంది.. మీరే న్యాయం చేయాలి అంటూ.. ఓ భర్త..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyberabad: మహిళల భద్రత కోసం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా కలిసి 2018 అక్టోబర్‌లో భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా భర్తల నుంచి ఫిర్యాదులు రావడం విశేషం. దాదాపు ఈ ఏడాది 5 ఫిర్యాదులు భర్తల నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం మహిళలకు(Womens) సమాజంలో భద్రత(Security) లేకుండా పోతోంది. ఒంటిరిగా బయటకు వెళ్లింది మొదలు సురక్షితంగా ఇంటికి వచ్చేదాక కూడా నమ్మకం లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కొంతమంది కామాంధులు మాత్రం మారడం లేదు. అయితే ఈ విషయంలో సైబరాబాద్(Cyberabad) పోలీసులు మహిళల భద్రత కోసం.. వాటి రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్(She Teams)ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దీని వల్ల మహిళలకు భరోసా కల్పించారు. దీంతో హైదరాబాద్ నగరంలో మహిళలు ధైర్యంగా బయటకు రాగలుగుతున్నారు. అయితే మహిళల కోసం ఏర్పాటు చేసిన ఆ షీ టీమ్స్ కు ఆ మహిళలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి.

    Shocking: ఏడాదిన్నర క్రితం వివాహం.. ఆ ఒక్క కారణంతో ఆమె ఏం చేసిందంటే..


    ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లోని ఐదుగురు పురుష బాధితులు మహిళలపై సైబరాబాద్‌ భరోసా సెంటర్‌లో ఫిర్యాదు చేశారు. 2019లో మహిళలపై 7 ఫిర్యాదులు రాగా.. 2020 సంవత్సరంలో దాదాపు 20కి పైగా కేసులు నమోద అయ్యాయి. ప్రస్తుతం ఈ ఏడాది ఐదుగురు ఫిర్యాదు చేశారు. అస్సలు ఈ ఫిర్యాదుల వేటిపై వస్తున్నాయంటే.. తన భార్య విడాకులు ఇవ్వమంటూ వేధింపులకు గురిచేస్తుందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా సైబరాబాద్‌ భరోసా కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా సైబరాబాద్‌ పరిధిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన బాధితుడు మద్యానికి బానిసగా మారి భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు.

    Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..


    అతడి వేధింపులను కొన్ని రోజుల వరకు ఓపిక పట్టిన సదరు మహిళ అతడికి దూరంగా ఉంది. ఆ ఇంటి నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి అతడి ప్రవర్తనలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. అంతే కాకుండా విడాకులు కావాలంటూ ఆమె డిమాండ్ కూడా చేసింది. తర్వాత కొన్నాళ్లకు తన తప్పు తెలుసుకున్నానని.. భార్యతో కలిసి జీవితాన్ని గడుపుతానని పోలీసులను ఆశ్రయించాడు.

    తన భార్య విడాకులు అడుగుతుందని.. తాను ఆమెతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు పోలీసులకు తెలిపి న్యాయం చేయాలని కోరాడు. సదరు మహిళకు ఫోన్ చేసిన పోలీసులు.. తన భర్తతో కలిసి ఉండలేనని తెగేసి చెప్పేసింది. తాను కౌన్సెలింగ్ కు కూడా రానంటూ తెలిపింది. పెద్దల సమక్షంలో ఏదో ఒక విషయం తేల్చుకుంటానని పోలీసులకు వెల్లడించింది. ఇలా దాదాపు చాలా వరకు భర్తలు ఆ భరోసా కేంద్రానికి ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

    Shocking Incident: కన్నతల్లి అని కూడా చూడలేదు.. వాటి కోసం కొడుకు ఏం చేశాడో చూడండి..


    మహిళల భద్రత కోసం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా కలిసి 2018 అక్టోబర్‌లో భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేంద్రానికి అన్ని ఫిర్యాదులను కలుపుకుంటే మొత్తం గత నెలలో 73 ఫిర్యాదులు అందగా.. అందులో 72 గృహ హింస కేసులు ఉండగా.. ఒకటి ఫోక్సో కేసు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. అయితే ఇందులో 12 మందికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

    అందులో 13 ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌ నమోదు నిమిత్తం సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు సూచించారు. కొన్ని ఫిర్యాదులు న్యాపరమైన చిక్కులు ఉండగా.. మరికొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 94906 17261 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా గానీ 040–29882977, డయల్‌ 100 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Cyberabad, Cyberabad crime, Cyberabad Police Commissioner

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు