• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD THE WOMAN WHO WENT TO WORK WAS RAPED AND MURDERED VB

She was raped and murdered: కూలికి వెళ్లిన మహిళపై అత్యాచారం.. ఆమె తలపై దారుణంగా కొట్టి..

She was raped and murdered: కూలికి వెళ్లిన మహిళపై అత్యాచారం.. ఆమె తలపై దారుణంగా కొట్టి..

ప్రతీకాత్మకచిత్రం

She was raped and murdered: తాపీ పనికి వెళ్లిన ఓ ఇల్లాలు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. భర్త కంగారు పడుతూ ఎక్కడికైనా తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లిందేమోనని ఫోన్ చేసి అడిగాడు. ప్రతీ ఒక్కరు ఇక్కడకు రాలేదు అనే సరికి తెల్లారేసరికి వస్తుందేమోనని అనుకున్నాడు. కానీ అతడికి ఓ శ్మశాన వాటిక నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే..

  • Share this:
    కూలి పనులకు వెళ్లే వారికి ఓ అడ్డా ఉంటుంది. ప్రతి ఒక్కరు అక్కడకు వచ్చి పని కోసం చూస్తుంటారు. ఆమె కూడా ఆ అడ్డాకు పనికోసం తన భర్తతో కలిసి వెళ్లింది. ఓ వ్యక్తి తన ఇంట్లో గదులకు ప్లాస్టింగ్‌ పని ఉందని దానికి ఓ మహిళ కావాలని తీసుకెళ్లాడు.  పని కోసం వెళ్లిన మనిషి సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. పనికి తీసుకెళ్లిన అతడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉండటంతో తెల్లారేసరికి వస్తుందిలే అనుకొని పడుకున్నాడు. కానీ ఉదయం కూడా రాకపోవడంతో తెలిసినవారి దగ్గర వెతికాడు. కానీ ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. కొద్ది సమయం తర్వాత ఓ శ్మశాన వాటికలో గుర్తుతెలియని శవం ఉందని తెలసుకున్నాడు. అక్కడకు హుటాహుటిన వెళ్లాడు. తలపై గట్టిగా కొట్టిన ఆనవాళ్లు ఉండటంతో ఎవరో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అక్కడకు వచ్చిన పోలీసులు తెలిపారు. దీంతో అతడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

    మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన చిన్నమ్మ(45), ఆంజనేయులు భార్యభర్తలు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట్‌ సక్కూభాయ్‌నగర్‌కు వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రోజూ అడ్డాకు వెళ్లి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఓ రోజు మణికొండ లేబర్‌ అడ్డాపైకి భార్య భర్తలు కూలి పని కోసం వెళ్లారు. ఓ వ్యక్తి తన ఇంట్లో గదులకు ప్లాస్టింగ్‌ పని ఉందని, ఒక మహిళ అవసరం ఉందని తెలపడంతో ఆంజనేయులు చిన్నమ్మను పంపించాడు. సాయంత్రం అయినా చిన్నమ్మ తిరిగి రాకపోవడంతో తీసుకెళ్లిన వ్యక్తికి ఫోన్‌ చేశాడు. తెల్లారి కూడా ఆయా ప్రాంతాల్లో ఆమెను వెతికారు. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉండడంతో ఎక్కడైనా పడిపోయిందేమోనని భర్త ఆంజనేయులు తనకు తెలిసిన వ్యక్తులతో ఆయా ప్రాంతాల్లో గాలించాడు. అయినా ఆచూకీ దొరకలేదు. షేక్‌పేట్‌ సక్కుభాయ్‌ శ్మశానవాటికలో ఓ మహిళ మృతి చెందిందన్న విషయాన్ని స్థానికులు గమనించి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మృతి చెందిన మహిళను పరిశీలించారు. ఎవరో ఆమెను తలపై కొట్టి చంపి పడేశారని పోలీసుల విచారణలో తేలింది. ఆమెను చిన్నమ్మగా గుర్తించారు. మహిళను అత్యాచారం చేసి చంపి ఉంటారా? కూలి కోసం తీసుకెళ్లిన వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కూలికి తీసుకెళ్లిన వ్యక్తి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ ఉండడం పోలీసులకు మరింత అనుమానాన్ని రేకెత్తించింది. భర్త ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: