హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shocking Incident: ఎంత పని చేశావమ్మా.. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఇలా జరిగేది కాదు కదా..

Shocking Incident: ఎంత పని చేశావమ్మా.. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఇలా జరిగేది కాదు కదా..

ఆత్మహత్య చేసుకున్న వివాహిత

ఆత్మహత్య చేసుకున్న వివాహిత

Shocking Incident: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అంబర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం వయసు, చదువు తో సంబంధం లేదు.. చిన్న పెద్ద తేడా లేదు.. చిన్ని చిన్న విషయాలకే తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటూ క్షణికావేశంలో తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. తాజాగా ఓ భార్యకు తన భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని.. ఏకంగా ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్(Hyderabad) లో చోటు చేసుకుంది. పోలీసులు(Police) తెలిపిన వివరాలు ప్రకారం పూర్తి సమాచారం ఇదే.. గోల్నాక తిరుమలనగర్‌లో(Tirumalanagar) శ్రీనివాసులు, విజయలక్ష్మి దంపతులు నివాసం ఉంటుంన్నారు.  ఈ దంపతులకు ఇద్దరు పిలల్లు.  శ్రీనివాసులు ఇంట్లోనే టైయిలర్ (Tailor) పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అంతే కాకుండా.. తన ద్విచక్రవాహనంపై కాలనీలు తిరుగుతూ.. చీరలను విక్రియిస్తుంటాడు.

అతడికి 25 ఏళ్లు.. పెళ్లైన 7 రోజులకే ఉపాధి కోసం సిటీకి వెళ్లాడు.. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసరికి అతడి భార్య..


ఇంట్లో టైలర్ భర్తగా ఉంటే.. ఇక భార్యలకు పండగే. మహిళలకు కావాల్సిన వాటిని వాళ్లతో కుట్టించుకుంటారు. ఇలా ఓ రోజు విజయలక్ష్మికి అతడు ప్రేమగా జాకెట్‌ను కుట్టాడు . అయితే ఆది నచ్చలేదని భార్య చెప్పడంతో శ్రీనివాస్‌‌కు, విజయలక్ష్మీకి మధ్య వాగ్వాదం చోటు చేసుంది. దీంతో విజయలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త ప్రవర్తన తో మనస్తాపం చెందిన విజయలక్ష్మి.. ఏ మాత్రం ఆలోచించకుండా.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Sadist Fathers: కన్న బిడ్డలపైనే కసాయి తండ్రుల కర్కశత్వం.. కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..


స్కూల్‌కి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చి బెడ్‌రూమ్ డోర్ కొట్టారు. ఎంతకు డోర్ తీయకపోవడంతో శ్రీనివాసులు వచ్చి బలవంతంగా తలుపులు తీసి చూడగా అప్పటికే విజయలక్ష్మి మృతి చెందింది. స్థానికుల వెంటనే అంబర్ పేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో ఘటనలో..ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన మహిళ మృతదేహమై కనిపించిన ఘటన అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

సీఐ శ్రీనివాసులు రెడ్డి వివరాల ప్రకారం మండలంలోని జానకంపేటకు చెందిన తలారి నర్సింలు భార్య నాగమణి(35) ఈ నెల 1న జిన్నారం వెళ్తున్నానని ఇంట్లో కుమారుడికి చెప్పి వెళ్లిఅదృశ్యమైంది. భర్త నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మృతురాలు పటాన్‌చెరులో మరో వ్యక్తితో ఉన్నట్లు గుర్తించారు. అతడిని గుర్తించి పోలీసులు అరెస్టు చేయగా.. తానే ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

First published:

Tags: Crime, Crime news

ఉత్తమ కథలు