(BalaKrishna M, News18)
హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో.. ఎక్కడ రోడ్డు పనులు కోసం రోడ్డు మళ్లిస్తారో తెలియని పరిస్థితి.. ఎదో అర్జెంట్ పని పై వెళ్లి తాము వెళుతున్న రూట్ లో ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకోలేక ట్రాఫిక్ (Traffic Problems)లో చిక్కుకున్న సందర్బాలు నగరంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ఉంటారు. అయితే మీరు ప్రయాణం స్టార్ట్ చేసేటప్పుడే మీరు వెళ్లే రూట్ లో ట్రాఫిక్ కు సంబంధించి ఒక స్పష్టమైన సమాచారం మీ మొబైల్ లో ఉంటే?..
అదేంటీ ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ (Google Maps) లో మనం ట్రాఫిక్ లైవ్ అప్డేట్స్ చూసుకోవచ్చు కదా..! ఇదేం కొత్త విషయం కాదునుకుంటున్నారా? ప‌్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న గూగుల్ మ్యాప్స్ లో వచ్చే ట్రాఫిక్ అఫ్డేట్స్ అంతా ఖచ్చితంగా ఉండటం లేదు. దానికి తోడు లైవ్ అప్డేట్స్ లో రోడ్డు మళ్లింపులకు సంబంధించిన సమాచారం పెద్దగా అందుబాటులో లేదు. ఈ సమస్యలను పరిష్కరించడానికి హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు (Hyderabad Traffic Police) గూగుల్ సహాకారంతో ఒక నయా యాప్ ను డెవలప్ చేశారు.
ట్రాఫిక్ ఎలా ఉందో ఖచ్చితంగా తెలుసుకునే వెసులుబాటు..
సిటీలో ట్రాఫిక్ అప్డేట్స్ (Traffic Updates) ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో వచ్చే విధంగా ఒక సాప్ట్ వేర్ ను డెవలప్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో మన ప్రయాణం ప్రారంభించే ముందే మనం వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఎలా ఉందో ఖచ్చితంగా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం దీనికి ట్రయిల్ రన్ ఉంది. సిటీ ట్రాఫిక్ పోలీసుల కోసం రూపొందించిన ఈ యాప్ (App)త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది.
గూగుల్ మ్యాప్స్ (Google Maps) ప్రస్తుతం మనం చూస్తున్న ట్రాఫిక్ లైవ్ అప్డేట్స్ కు ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, బ్లాక్ చేయబడిన రోడ్లు, ఉదాహరణకు, ఇప్పుడు నాలా పనుల కోసం మూసివేయబడిన యాత్రి నివాస్-రసూల్‌పురా స్ట్రెచ్ మ్యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు చూపదు. బదులుగా, సింధీ కాలనీ, మినిస్టర్ రోడ్ మీదుగా రసూల్‌పురా వైపు తిరిగే ప్రత్యామ్నాయ మార్గం హైలైట్ చేయబడుతుంది.
లైవ్ అప్డేట్స్ లో ఆలస్యం..
ట్రాఫిక్ పరిస్థితి, మళ్లింపులు లేదా ఆంక్షలు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గూగుల్ (Google) తో ఒక అవగాహనకు వచ్చిన ఈ సాప్ట్ వేర్ ను డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు ఏదైనా మార్గంలో ట్రాఫిక్ మళ్లింపుల గురించి లేదా అంతరాయం గురించి కనీసం ఒక రోజు ముందుగానే గూగుల్ కి సమాచారం పంపేవారు. దీంతో లైవ్ అప్డేట్స్ లో ఆలస్యం జరిగేది. ఆ రోడ్డులో మళ్లింపు సమాచారం ప్రయాణికులకు తెలియక భారీగా ట్రాఫిక్ జామ్ లు అయ్యేవి.
అయితే ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల సహకారంతో రూపొందించిన ఈ యాప్ ను ట్రాపిక్ పోలీసుల ట్యాబ్‌లలో ఇన్‌స్టాల్ చేయడం ద్వారా అక్కడ డ్యూటీలో ఉన్న అధికారులు ఈ యాప్ లోకి లాగిన్ అయి మూసి ఉన్న రోడ్లు, వాటర్ ల్యాగ్ వల్ల రోడ్డు మళ్లింపుల వంటి సమస్యలపై అప్‌డేట్‌లు ఇస్తారు. దీంతో తక్షణమే గూగుల్ ఆ నిర్దిష్ట మార్గాన్ని మ్యాప్‌లో బ్లాక్ చేసి దానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించడంతో పాటు ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఎలా ఉందో కూడా వివిధ రంగుల ద్వార గూగుల్ లైవ్ అందుబాటులో ఉంచుతుంది.
ప్రస్తుతం ఈ టెక్నాలజీతో ఏదైనా రహదారికి సంబంధించిన సమస్య ఉంటే, అది వెంటనే గూగుల్ మ్యాప్ లో హైలెట్ చేయబడుతుంది. దీంతో ప్రయాణికులు ఆ మార్గంలో కాకుండా గూగుల్ చూపించిన మరో మార్గంలో వెళ్లడానికి వీలుగా ఉంటుంది. ఈ సదుపాయం ప్రయాణికులందరికీ సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతోపాటు ట్రాఫిక్ పోలీసుల విషయానికొస్తే, ట్రాఫిక్ నిర్వహణ మరింత సులభతరం అవుతుందని అభిప్రాయడుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad Traffic Police, Traffic challans, Traffic rules