HYDERABAD THE SON IN LAW WAS CONVICTED OF MANSLAUGHTER FOR NOT BUYING HIS UNCLEVS TWO WHEELER VB
Telangana Crime: మామ మాట తప్పాడని.. అల్లుడు ఆత్మహత్య.. అసలు విషయం ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం
Telangana Crime: తన మామ ద్విచక్ర వాహనం కొనివ్వలేదని అల్లుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల రోజుల తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో వెలుగు చూసింది. పూర్తి వివరాలు..
అతడు ఆరేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇరువురి కుటుంసభ్యులు వారి ప్రేమను అంగీకరించపోవడంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వారి కుటుంబసభ్యులతో సంబంధం లేకుండా వేరుగా ఉంటున్నారు. కొన్నేళ్ల తర్వాత భార్య తరఫు తల్లిదండ్రలు ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. అప్పటి నుంచి వారు వీరి దగ్గరకు రాకపోకలు సాగించండం ప్రారంభించారు. ఓ రోజు తన మామ అల్లుడికి బండి కొనిస్తానని మాట ఇచ్చాడు. బైక్ కొనివ్వాలంటూ సంవత్సరం క్రితం తన మామను అల్లుడు అడగడం ప్రారంభించాడు. అతడి వద్ద నుంచి సరిగ్గా సమాధానం రాకపోవడంతో ఆరు నెలల క్రితం అతడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పుడు కుటుంబసభ్యులు గమనించి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. తర్వాత మళ్లీ మే నెలలో బండి కొనివ్వమని మామను అడగడంతో కొనివ్వలేదు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటి నుంచి వెల్లిపోయిన సదరు వ్యక్తి కనిపించలేదు. తాజాగా అతడి శవం తన సొంత అన్నకు ఓ పాత ఇంట్లో కనిపించింది. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి ఎస్సై లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పురపాలిక పరిధిలోని బుల్కాపురానికి చెందిన క్రాంతికుమార్(30) ప్లంబర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల క్రితం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకోవడంతో.. రెండిళ్లలోనూ కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. నాటి నుంచి శంకర్‌పల్లిలోని హనుమాన్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్ల తర్వాత భార్య తల్లిదండ్రులు వీరి దగ్గరకు రాకపోకలు సాగించడం.. ఈ క్రమంలో వారు బండి కొనిస్తామని మాటిచ్చారు. ఆ మేరకు బైక్ కొనివ్వాలంటూ ఏడాది కాలంగా తన మామను అతను అడుగుతున్నాడు. సరిగ్గా స్పందన లేకపోవడంతో మార్చిలో పురుగుమందు తాగాడు. కుటుంబీకులు వెంటనే చికిత్స చేయించగా కోలుకున్నాడు.
మే నెలలో మళ్లీ బండి కోసం గొడవ పడి.. ఇంటి నుంచి వెళ్లిపోగా, ఆయన భార్య సైతం పుట్టింటికి చేరుకుంది. నివాసం నుంచి బయటికెళ్లిన క్రాంతికుమార్ బుల్కాపురంలో పాత ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఆ ఇంటి లోపలకి ఎవరూ వెళ్లకపోవడంతో ఆ విషయం బాహ్యప్రపంచానికి తెలియకుండా పోయింది. నెల రోజుల తర్వాత బుధవారం తన అన్న పురుషోత్తం ఆ ఇంటి తలుపులు తీయగా క్రాంతికుమార్ మృతదేహం కనిపించింది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.