HYDERABAD THE RISING CORONA CASES IN TOLLYWOOD ARE POSITIVE FOR BANDLAGANESH FOR THE THIRD TIME SNR
టాలీవుడ్లో థర్డ్‌వేవ్ ఎఫెక్ట్..మూడో సారి వైరస్ బారినపడ్డానని నిర్మాత ట్వీట్..
Photo Credit: TWITTER
CORONA FEVER: టాలీవుడ్‌ని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలకు పాజిటివ్‌గా నిర్ధారణైంది. కొత్తగా నిర్మాత బండ్లగణేష్ కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్ రావడం ఇది మూడోసారి. అంతా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప రోడ్లపై రావద్దని సూచించారు గణేష్.
కరోనా ఎవ్వర్ని వదలడం లేదు. థండర్ సీజన్లో కూడా థర్డ్‌వేవ్ (Third wave)దడ పుట్టిస్తోంది. వైరస్ సోకడంతో మహామహులు మంచాన పడుతున్నారు. సినీ పరిశ్రమ(Film industry)కు చెందిన చాలా మంది వైరస్ బారినపడుతున్నారు. తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla ganesh)కి మరోసారి పాజిటివ్ (Positive)వచ్చింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్( Home isolation)లో ఉన్నారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా (Social medi)aద్వారా వెల్లడించారు. గతంలో కూడా బండ్ల గణేష్‌కు రెండు సార్లు కరోనా సోకింది. థర్డ్‌వేవ్‌లో కూడా వైరస్ ఆయన్ని వదల్లేదు. రెండోసారి కరోనా వచ్చినప్పుడు ఆయనకు హాస్పిటల్లో బెడ్ కూడా దొరకని పరిస్థితి తలెత్తింది. మూడోసారి తనకు పాజిటివ్ వచ్చిందని..గత మూడ్రోజులుగా ఢిల్లీ (Delhi)లో ఉన్నానని ఆదివారం (Sunday)సాయంత్రం హైదరాబాద్ (Hyderabad)వచ్చినట్లు బండ్ల గణేష్ ట్విట్టర్ (Twitter)ద్వారా ఈవిషయాల్ని వెల్లడించారు. పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని..అయితే తన కుటుంబ సభ్యుల్లో ఎవరికి కరోనా సోకలేదని..టెస్ట్‌లు చేయిస్తే అందరికి నెగిటివ్(Negative)వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్న బండ్ల గణేష్ స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న వీడియోని కూడా ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు బండ్ల గణేష్.
టాలీవుడ్‌కి థర్డ్‌వేవ్ థ్రెట్..
ప్రయాణాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు గణేష్. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సలహా ఇచ్చారు. కరోనా ప్రభావం పూర్తిగా పోలేదని..అంతా అప్రమత్తంగా ఉంటేనే మంచిదని పదే పదే సెలబ్రిటీలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు సినీ, రాజకీయ ప్రముఖులే కరోనా బారినపడుతున్న ఇలాంటి సమయంలోనైనా అంతా జాగ్రత్తగా ఉంటే మంచిది.
Last three days I was at delhi and I tested positive today evening .
I have mild symptoms, and my family is tested negative . Please be careful and think before you travel I’m in isolation .
Thank you #Besafepic.twitter.com/9i4CIRI5XC
ముచ్చటగా మూడోసారి..
బండ్లగణేష్‌తో పాటు సినీ నటుడు, నటకిరిటి రాజేంద్రప్రసాద్ సైతం కరోనా బారినపడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. స్వల్ప లక్షణాలను గుర్తించడం వల్లే టెస్ట్‌లు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని అంతా జాగ్రత్తగా ఉండాలంటూ పిలుపునిచ్చారు నటకిరిటి.
ఎవర్ని వదలని మహమ్మారి..
వీరితో పాటు టాలీవుడ్‌కి చెందిన వాళ్లలో మహేష్‌బాబు, తమన్, మంచు లక్ష్మి లాంటి స్టార్లు సైతం వైరస్ సోకి రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వైరస్ అటాక్ చేయడం ఖాయమని బాధితులు సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.