Home /News /telangana /

HYDERABAD THE POLICE WERE SHOCKED TO SEE THE BACKGROUND OF THE PERSON WHO WAS CAUGHT STEALING IN HYDERABAD PRV

Shocking Thief: హైదరాబాద్​లో దొంగ అరెస్ట్.. బ్యాక్​గ్రౌండ్​ చెక్​ చేసి షాక్​ అయిన పోలీసులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం కేసులో గుంటూరు వ్యక్తిని హైదరాబాద్​ పోలీసులు ఇటీవలె అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బ్యాక్​గ్రౌండ్​ చెక్​ చేసి ఖంగుతిన్నారు ఖాకీలు. ఇంతకీ ఎవరా వ్యక్తి?

    చదివింది ఎంబీఏ (MBA). మాస్టర్​ ఆఫ్​ బిజినెస్​ అడ్మినిస్ట్రేషన్​. ఏదో బోటాబోటీ మార్కులతో పాస్​ అయ్యాడనుకుంటే పొరబాటే. ఏకంగా బంగారు పతకం (Gold medalist) సాధించాడు... ఇంకేంటీ.. హాయిగా మంచి ఉద్యోగం సాధించి.. జీవితంలో స్థిరపడ్డాడనుకున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. బంగారు పతకం సాధించిన చేతులతోనే చోరీలకు (Stealing) అలవాటు పడ్డాడు యువకుడు. అంతేకాకుండా క్యాబ్ డ్రైవర్గా వృత్తిని ఎంచుకున్నాడు. ఇళ్లల్లో దొంగతనాలు (Theft) చేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు గోల్డ్​ మెడలిస్ట్​. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 వరకు దొంగతనాలు (Theft) చేశాడు. ఈ నేరాలు చేసే క్రమంలో పలుసార్లు జైలుకెళ్లి వచ్చాడు కూడా మనోడు.  మరి అప్పుడైనా మారాడా అంటే అయినా తీరు మార్చుకోలేదు. బయటికొస్తే అదే పని. ఈ గోల్డ్​ మెడలిస్ట్​ ఎక్కడి వాడు? ఎలా దొరికాడు? కథా కమామిషు ఇపుడు తెలుసుకుందాం..

    గుంటూరు (Guntur)కు చెందిన మిక్కిలి వంశీ కృష్ణ (Vamshi Krishna)అలియాస్ లోకేష్ అలియాస్ రిచర్డ్ నగరంలో క్యాబ్ డ్రైవర్​ (Cab driver)గా పని చేస్తున్నాడు. గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం కేసులో వంశీకృష్ణను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 10 తులాల బంగారు నగలు, మూడు లక్షల రూపాయల నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.



    జల్సాలకు అలవాటు..

    అయితే ఈ వంశీకృష్ణ చిన్నప్పటి నుంచి బాగా చదువుతాడు. చాలా చురుకైన వ్యక్తి కూడా. 2004లో ఎంబీఏలో ఏకంగా గోల్డ్ మెడల్ (Gold medal in MBA) సాధించి కాలేజీలో అందరి చేత ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే ఆ తర్వాత చెడు అలవాట్లు, తిరుగుడులు ఎక్కువైపోయాయి. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో ఉద్యోగం చేయడం.. దాంట్లో వచ్చే జీతం (salary) డబ్బులు సరిపోవనిపించింది మనోడికి. అందుకే సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు గోల్డ్​ మెడలిస్ట్​. దీనికోసం దొంగతనాలే బెస్ట్ ఆప్షన్ అని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవాడు. అలా ఇళ్లు దొరికితే గప్ చిప్ గా దొంగతనం చేసి మాయమయ్యేవాడు. ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు.

    డబ్బు ఖర్చవ్వగానే.. మళ్లీ దొంగతనానికి పాల్పడేవాడు. అలా.. హైదరాబాద్ (Hyderabad) తో పాటు, ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)లోని పలు జిల్లాల్లోనూ చాకచక్యంగా దొంగతనాలకు (Stealing) పాల్పడేవాడు. 2006 నుంచి ఇప్పటివరకు అలా 200 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు. వివిధ కేసుల్లో సుమారు 67 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అతనిమీద పోలీసులు రెండుస్తారు పీడీ యాక్ట్ (PD Act) కూడా నమోదు చేశారు. అయినా తీరు మారలేదు. అయినా ఎంతగా చదివినా గోల్డ్​మెడల్​ కొట్టినా ఏం లాభం.. ఆ చదువులో విలువలు నేర్చుకోలేకపోయాడు వంశీకృష్ణ. చివరికి దొంగగా మారి కటకటాల పాలయ్యాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cabs, College student, Crime news, Gold, Guntur, Hyderabad, Theft

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు