మీరు జాబ్ చేస్తున్నా డబ్బులు సరిపోవడం లేదా? నెల తిరిగే సరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదా.? ఐతే ఉద్యోగం చేస్తూనే కొన్ని వ్యాపారాలు (Business Ideas) చేయవచ్చు. అది కూడా ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. మీరు లేకున్నా.. మీ ఇంట్లో శ్రీమతి కూడా వీటిని చూసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. చెమట చుక్క చిందించకుండానే డబ్బులువస్తాయి. అలాంటి వ్యాపారాల (Business Tips) గురించి తెలుసుకుందా. ప్రతి ఇంటికీ డాబా ఉంటుంది. ఆ పైకప్పును వినియోగించుకొని భారీగా ఆదాయం పొందవచ్చు. ఇందులో నష్టపోయే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. చాలా ఈజీగా డబ్బు వస్తుంది. అందుకోసం టెర్రస్ ఫార్మింగ్, మొబైల్ టవర్ ఏర్పాటు, హోర్డింగ్ వంటి ఎన్నో అవకాశాలున్నాయి.
పర్సనల్ లోన్ వర్సెస్ గోల్డ్ లోన్.. రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోండి
టెర్రస్ ఫార్మింగ్:
ఈ రోజుల్లో చాలా మంది టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇంటి డాబాపైనే వ్యవసాయం చేసి..ఆ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముతూ.. డబ్బు సంపాదిస్తున్నారు. మీకు కూడా డాబా ఉంటే దానిపై వ్యవసాయం చేయవచ్చు. టెర్రస్ ఫార్మింగ్‌కు ముఖ్యంగా రెండు అంశాలు అవసరం. మొదటిది డబాపై విశాలమైన స్థలం ఉండాలి. రెండవది.. సూర్యరశ్మి పుష్కలంగా ఉండాలి. పైకప్పు ఎంత విశాలంగా ఉంటే.. అన్ని ఎక్కువ మొక్కలు నాటవచ్చు. మొక్కలు ఎంత ఎక్కువగా ఉంటే.. అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. టెర్రస్ ఫార్మింగ్‌లో కూరగాయలను పాలీబ్యాగుల్లో నింపి నాటాలి. నీటిపారుదల కోసం డ్రిప్ వ్యవస్థను ఉపయోగించవచ్చు.
మొబైల్ టవర్స్:
ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదు. చాలా మంది తమ ఇళ్లలపై మొబైల్ , రేడియో టవర్స్ ఏర్పాటు చేసుకొని డబ్బు సంపాదిస్తున్నారు. ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందాలి. మీరు ఏదైనా మొబైల్ కంపెనీతో పాటు మాట్లాడుకొని ఇంటిపై టవర్ ఇన్‌స్టాల్ చేసకోవవచ్చు. సదరు మొబైల్ కంపెనీ మీకు ప్రతి నెలా డబ్బు చెల్లిస్తుంది. ఐతే మొబైల్ టవర్‌తో వచ్చే రేడియేషన్ వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది.
హోర్డింగ్స్:
పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో ఇళ్లపై హోర్డింగ్‌లు కనిపిస్తుంటాయి. మీ ఇల్లు ఒకవేళ రోడ్డుకు పక్కనే ఉంటే.. మీ డాబాపైనా ఇలాంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకవోచ్చు. ఇందుకోసం అనేక ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. మీరు అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాత.. ఏజెన్సీతో మాట్లాడుకొని.. హోర్డింగ్ ఏర్పాటు చేసుకోవాలి. దీని ద్వారా ప్రతి నెలా ఆదాయం వస్తుంది. మీకు వచ్చే ఆదాయం.. ఎంత విస్తీర్ణంలో హోర్డింగ్ పెట్టారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
సోలార్ ప్యానెల్స్:
ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడం ద్వారా మీ ఇంటికి కావాల్సిన విద్యుత్‌ను మీరే తయారు చేసుకోవచ్చు. తద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు. అంతేకాదు మిగిలిన విద్యుత్‌ను విక్రయించి.. డబ్బు సంపాదించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా సౌరశక్తి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోంది. సౌర ఫలకాల కోసం ప్రభుత్వం సులభమైన వాయిదాలలో రుణాలను కూడా ఇస్తుంది. లక్ష రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. సౌరశక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేసి.. ప్రైవేట్ సంస్థలు లేదా ప్రభుత్వానికి విక్రయించవచ్చు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business Ideas, Hyderabad, Local News