Home /News /telangana /

HYDERABAD THE MOTHER DIED AT THE GATCHIBAULI HOSPITAL A SON COMMITTED SUICIDE BY JUMPING INTO A POND AFTER TAKING A SELFIE VIDEO WITHOUT BEING ABLE TO PAY THE BILL VB

Telangana: తండ్రికి క్యాన్సర్.. తల్లి కరోనాతో మృతి.. ఆసుపత్రి బిల్లు కట్టలేక ఓ కుమారుడు దారుణం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: కరోనా బారిన పడిన తన తల్లిని ఓ కుమారుడు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. చివరకు ఆమె ప్రాణాలు విడవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

    కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. కుటుంబంలో తీరని శోకాలను మిగిల్చింది. ఓ కుటుంబం మాయాదారి రోగాల కారణంగా ఓ కుంటుంబం చిన్నిబిన్నమైంది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో వైరస్ గాలిలో కలిసిపోయింది. ఎవరికి ఎప్పడు సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని రోజుల కిందట తన త్తల్లి కరోనా బారిన పడింది. అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే వైద్యులు నాలుగు రోజుల తర్వాత తన తల్లి చినిపోయిందంటూ చావు కబురు తెలిపారు. తన తల్లి శవాన్ని తీసుకెళ్దామని ఆసుపత్రికి రాగా రూ.10 లక్షలు కట్టి శవాన్ని తీసుకెళ్లండంటూ చెప్పారు. అసలే బీద కుటుంబం. కుటుంబ పెద్ద క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దీంతో అన్ని డబ్బులు ఎక్కడ నుంచి తేవాలో అర్థం కాక.. తీవ్ర మనస్థాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధుబాన్ కాలనీలో రుక్మిణి(60), తన కుమారుడు శ్రీహరి (22), తన తండ్రి కలిసి నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట రుక్మిణి కరోనా బారిన పడి గచ్చిబౌలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. విషయం తెలుసుకున్న శ్రీహరి ఆసుపత్రికి వెళ్లగా రూ. 10 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని దవాఖాన యాజమన్యం చెప్పింది. తన తండ్రి కూడా క్యాన్సర్‌తో బాధపడుతుండగా తన తల్లి మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. సెల్ఫీ వీడియో తీసుకొని ‘‘కరోనా బారినపడిన మా అమ్మ రుక్మిణి(60) చికిత్స పొందుతూ గచ్చిబౌలిలోని ప్రైవేట్‌ దవాఖానలో మృతి చెందింది.

    రూ. 10 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని దవాఖాన యాజమన్యం చెప్పింది. నా తండ్రి కూడా క్యాన్సర్‌తో బాధపడుతూ.. తన కుబుంబ పరిస్థితిని వివరిస్తూ తన ఆవేదనను వెలిబుచ్చాడు. తదనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహం కోసం చెరువులో గాలింపు చేపట్టారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Attemp to suicide, Corona, Gachibowli, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు