HYDERABAD THE MINOR GIRL WAS RAPED AT MOOSAPET IN TELANGANA VB
Rape of a minor: మైనర్ పై అత్యాచారం.. ఆపై అర్ధనగ్నసెల్ఫీ.. చివరకు ఆ సెల్పీ ఫొటో బాలిక బంధువుల వాట్సాప్ కు చేరడంతో..
ప్రతీకాత్మక చిత్రం
Rape of a minor: పుట్టిన రోజు ఉందని తన దూరపు బంధువు అయిన మైనర్ బాలిక ను ఆహ్వానించాడు. ఇంటికి రమ్మని తనపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా అర్థనగ్న సెల్ఫీ తీసుకొని తన స్నేహితులకు పంపించాడు. బాలిక బంధువులకు ఆ ఫోటో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పుట్టిన రోజు ఉందని తన దూరపు బంధువు అయిన మైనర్ బాలిక ను ఆహ్వానించాడు. ఇంటికి రమ్మని కేక్ కట్ చేసి, కూల్ డ్రింక్స్ తాగారు. అనంతరం గదితోకి తీసుకెళ్లి మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా అర్థనగ్న సెల్ఫీ తీసుకొని తన స్నేహితులకు పంపించాడు. బాలిక తల్లిదండ్రులకు ఆ ఫోటో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నర్సింగ్‌రావు వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మూసాపేట జనతానగర్‌లో నివాసముంటున్న జై బాలు (25), ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జనతా నగర్ కాలనీలోనే నివాసం ఉంటున్న తనకు దూరపు బంధువైన బాలికను గత నెల 17న తన పుట్టిన రోజు ఉందని ఇంటికి పిలిపించుకున్నాడు. గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతే కాకుండా అర్ధనగ్నంగా ఓ సెల్ఫీ తీసి తన స్నేహితులకు పోస్టు చేశాడు.
ఆ ఫొటో బాలిక బంధువులకు చేరటంతో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఈ నెల 10న కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
దర్యాప్తులో భాగంగా సదరు బాలికను పోలీసులు విచారించగా బలవంతంగానే తనను అత్యాచారం చేసినట్లు పేర్కొంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించామని.. త్వరలో అతడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.