Home /News /telangana /

HYDERABAD THE LIZARD CAME OUT WHILE EATING A CHICKEN BIRYANI ORDERED BY A CORPORATOR FROM A FAMOUS HOTEL IN HYDERABAD PRV

Lizard in Chicken Biryani: కార్పొరేటర్ చికెన్​​ బిర్యానీలో బల్లి.. సగం బిర్యానీ తిన్న తర్వాతే గుర్తింపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్​ అంటేనే చికెన్​ బిర్యానీ,  అలాంటి భాగ్యనగరంలో తయారు చేసిన బిర్యానీలో బల్లి బయటపడటం కలకలం రేపింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి హోటల్‌ బిర్యానీలో ఈ బల్లి కనిపించింది.

    హైదరాబాద్​  (Hyderabad) అంటేనే చికెన్​ బిర్యానీ (Chicken Biryani),  అలాంటి భాగ్యనగరంలో తయారు చేసిన బిర్యానీలో బల్లి బయటపడటం కలకలం రేపింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి హోటల్‌ (Bawarchi Hotel) బిర్యానీలో ఈ బల్లి (Lizard in chicken Biryani) కనిపించింది. రామ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ (Corporator) రవి చారి (బీజేపీ)కి ఈ చేదు అనుభవం ఎదురైంది. క్రాస్ రోడ్‌లోని ఆ రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్న చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసి తింటుండగా.. ఆ బిర్యానీలో చనిపోయి ఉన్న బల్లి కనిపించిందని రవి చారి తెలిపారు. సగం బిర్యానీ తిన్న తర్వాత బల్లి ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. వెంటనే ఆ దృశ్యాలను తన  సెల్ ఫోన్లో వీడియో తీయించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

    కార్పొరేటర్ రవి చారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ బిర్యానీ శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కి పంపించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్స్‌పెక్టర్ బావర్చి బిర్యానీ సెంటర్‌కు చేరుకొని తనిఖీలు నిర్వహించారు.

    బావర్చి హోటల్​లో తనిఖీలు చేస్తున్న అధికారిణి


    కమిషనర్​ ప్లేట్​లోనే బొద్దింక..

    గతంలో నిర్మల్ (Nirmal)​ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తెలంగాణలోని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, తన సిబ్బందితో కలిసి భోజనం చేసేందుకు నిర్మల్​ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ కు వెళ్లారు. ఆ హోటల్​ పేరు లక్ష్మీ గ్రాండ్ హోటల్. పేరుకు తగ్గట్లే హోటల్​ చాలా గ్రాండ్​గా కనిపిస్తుంది. తనకు సిబ్బందికి కలిపి కమిషనర్​ చికెన్​ బిర్యాని ఆర్డరిచ్చారు. కొద్దిసేపటికే హోటల్​ సిబ్బంది కూడా వినమ్రంగా బిర్యానీ తెచ్చి వడ్డించారు. అసలే ఆకలిగా ఉన్న కమిషనర్​, సిబ్బంది తినడానికి సిద్ధమయ్యారు. అయితే తన ప్లేట్​లో బిర్యానీ చూసి కమిషనర్​ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆయనకు వడ్డించిన బిర్యానిలో బొద్దింకలు, పురుగులు బయటపడ్డాయి.

    దీంతో ఆగ్రహించిన కమిషనర్​ ఆ హోటల్​లోని వంటగదిని సిబ్బందితో కలిసి తనిఖీ చేశాడు. అక్కడ పూర్తిగా కుళ్లిన, అపరిశుభ్రమైన మాంసాన్ని వండుతున్నట్లు గుర్తించారు. ఇక హోటల్​ ఫ్రిజ్​లో ఉంచిన చికెన్ కు బూజు పట్టి ఉండటం కమిషనర్ గమనించారు. అంతేకాకుండా కిచెన్​లోని పలు ఆహార పదార్థాలు కలుషితమయ్యాయని గుర్తించారు. అదే ఆహారాన్ని వండి కస్టమర్లకు వడ్డిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వంటగది మొత్తం తిరిగిన కమిషనర్​కు ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపించింది. దీంతో రెస్టారెంట్​ యాజమాన్యం ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చారు.

    సాక్షాత్తూ కమిషనర్​కే బొద్దింకలతో ఉన్న ఆహారాన్ని వడ్డించడంతో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అప్పటికప్పుడు హోటల్​పై  కమిషనర్​ బాలకృష్ణ చర్యలు తీసుకున్నారు. లక్ష్మీ గ్రాండ్ హోటల్​ను సీజ్ చేశారు. రూ.50 వేలు జరిమానా సైతం విధించారు. అంతేకాకుండా ఎవరైనా సరే హోటల్​, రెస్టారెంట్లలో ఇలాగే నాణ్యత లేని ఆహార పదార్థాలను ఉపయోగిస్తే సీజ్ చేస్తామని కమిషనర్​హెచ్చరించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Chicken biryani, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు