భార్య, భర్తలు(Wife and Husband) అన్నాక కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు.. ఆపై కలిసుంటారు. కానీ ఓ భర్త (Husband) తనను భార్య కొట్టిందంటూ వెక్కివెక్కి ఏడ్చాడు. అతడు ఇదే విషయాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ (Police Station) కి వెళ్లి చెప్పాడు. అది మరీ రాత్రిపూట. దీంతో పోలీసులు అతడిని సముదాయించి పంపారు. భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడు మనస్పర్థలు రావడం అనేది కామన్. సమస్య ఏదైనా కొంతమంది నాలుగు గోడల మధ్యనే చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొంతమంది వీధికెక్కి రచ్చ రచ్చ చేస్తారు. కానీ ఇక్కడ ఇతడు తనను భార్య కొట్టిందంటూ వెక్కివెక్కి ఏడ్చాడు. ఇది ఏ నాలుగు గోడల మధ్యలో కాదు.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఇంట్లో భార్యను ఎదిరించలేక.. వీధికెక్కి ఆమెను నిలదీయలేక.. నిస్సహాయంగా వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.
భార్య తనను కొడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట వెక్కి వెక్కి ఏడవడం గమనించవచ్చు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 'ఏడ్వకు.. ఏడ్వకు.. పొద్దున రాపో.. పెళ్లాలు కొడుతారు ఏం చేస్తాం.. జమానా అలా అయిపోయింది..' అంటూ ఓ పోలీస్ సిబ్బంది అతన్ని సముదాయించాడు. అయినప్పటికీ అతను మాత్రం ఏడుపు ఆపలేదు. చిన్నపిల్లాడిలా కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడుస్తూ.. ఉన్నాడు.
భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం.. ఓపిక పట్టాలి అని బుజ్జగించి ఇంటికి సాగనంపారు. పాపం.. ఇంటికెళ్లాక అతని భార్య మళ్లీ ఎలా రియాక్ట్ అయి ఉంటుందోనని.. ఈ వీడియో చూసిన నెటిజన్లు (Netizen) కామెంట్(Comment) చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. గత కొద్ది రోజుల నుంచి భార్యాబాధితులు ఇలా పోలీసుస్టేషన్ కు రావడం అనేది కొత్తేమి కాదు. గత నెల రోజుకొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లో కొంతమంది భార్యా బాధితులు కలిసి ఒక సంఘం కూడా పెట్టారు. అప్పట్లో సుందరయ్య విజ్ఞాన భవన్‌లో దానిపై ఓ సమావేశం కూడా నిర్వహించారు.
ఆ సమావేశం ద్వారా భార్యా బాధితుల బాధలు, ఆవేదనలు ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. మరో విషయం ఏంటంటే.. భార్యాబాధితుల సంఘానికి సంబంధించి సమస్యలను పరిష్కరించాలని.. తమకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం ఏమైనా చట్టాలు లాంటివి తీసుకురావాలని కూడా డిమాండ్ చేసిన సందర్భాాలు ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది నవ్వుకున్నారు.. పాపం అతడికి ఎంత కష్టం వచ్చిందో అంటూ.. జాలి పడినవారు కూడా ఉన్నారు. అయితే దీనిని ఫన్నీగా తీసుకొని.. సోషల్ ప్లాట్ ఫాంలో వీడియోను నెటిజన్లు వైరల్ చేసేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad police, Telangana, Trending news, Trending videos, Viral Video