హోమ్ /వార్తలు /తెలంగాణ /

Aasara Pensions: ఇక వారికి కూడా ఆసరా పింఛన్​.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు!

Aasara Pensions: ఇక వారికి కూడా ఆసరా పింఛన్​.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆసరా పథ కం (Aasara pensions) ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవి-ఎయిడ్స్‌, ఫైలేరియా ప్రభావిత వ్యక్తులు (గ్రేడ్‌-2, ) చేనేత, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నది. తాజాగా ఈ కేటగిరీలో మరో వర్గం చేరే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఆపన్నులకు అండగా ఉండటమైనా…  పది మందిని ఆదుకోవడమైనా,  ఏదైనా సరే, చుట్టపు చూపుగనో, మొక్కుబడిగనో జరగకూడదు. మనస్ఫూర్తిగా జరగాలి. ప్రభుత్వం కేవలం ప్రభుత్వంగా కాకుండా, ప్రజల కేర్‌ టేకర్‌గా ఉండాలి. పొదుపును పాటిస్తూనే, అవసరమెనౖ చోట చేతికి ఎముక లేదా? అన్నంతగా ఖర్చు చేయాలి.. ఇవన్నీ అనుభవంలో ఉన్నందుననే సీఎం కేసిఆర్ (CM KCR) ప్రభుత్వ పథకాలకు కేవలం అభివృద్ధి, సంక్షేమాలనే కాదు. మానవీయ కోణాలని కూడా అనుసంధానించారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు (Aasara pensions) విజయవంతంగా అమలు అవుతున్నాయి. పేదలందరికీ గౌరవప్రదంగా బతికే అవకాశం, భద్రతతో కూడిన భరోసానిస్తూ, సురక్షితమై జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం నవంబర్‌ 2014 నుండి ‘ఆసరా’ పెన్షన్‌ పథ కాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. ఆసరా పథ కం (Aasara pensions) ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవి-ఎయిడ్స్‌, ఫైలేరియా ప్రభావిత వ్యక్తులు (గ్రేడ్‌-2, ) చేనేత, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నది. తాజాగా ఈ కేటగిరీలో మరో వర్గం చేరే అవకాశం ఉంది.  తెలంగాణలోని (Telangana) ట్రాన్స్‌‌జెండర్లను (Transgenders) ఆసరా పింఛన్​తో ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు (High court) సూచించింది.

  రూల్స్‌‌ అనుమతిస్తే ఆసరా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడంపై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌  స్పందించింది. ఈ అంశాన్ని టెక్నికల్‌‌గా చూడొద్దని.. సమాజంలో చిన్న చూపునకు గురయ్యే ట్రాన్స్‌‌జెండర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

  కరోనా టైంలో ట్రాన్స్‌‌జెండర్లకు  (Transgenders) వ్యాక్సిన్, ఉచిత రేషన్‌‌ ఇచ్చేలా ఆదేశాలివ్వాలని  కోరుతూ వైజయంతి వసంత మొగలి అలియాస్‌‌ ఎం.విజయకుమార్‌‌ పిల్‌‌ వేశారు. సీఎస్ సహా వైద్యారోగ్య, సివిల్ సప్లయ్, హోం, ఆర్ధిక, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.  దానిపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది జైనాబ్ వాదనలు వినిపించారు. ట్రాన్స్ జెండర్లకు ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సర్వే ప్రకారం రాష్ట్రంలో 58,000 మంది ట్రాన్స్ జెండర్లు ఉండగా, 12,000 మందికే కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారని చెప్పారు.

  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక​ లాంటి రాష్ట్రాల్లో ట్రాన్స్ జెండర్ల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోనూ వారి కోసం పథకాలు అమలు చేసేలా చూడాలని లాయర్​ విజ్ఙప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది రాధిశ్​ రెడ్డి వాదిస్తూ ట్రాన్స్ జెండర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ చేపట్టామని కోర్టుకు విన్నవించారు. పిటిషన్ వేసే నాటికి 12,000 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినా.. ప్రస్తుతం దాదాపు అందరికీ పూర్తయిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ట్రాన్స్ జెండర్లకు అసరా (Aasara pensions) వర్తింజేయాలంది. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది హైకోర్టు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Aasara pension, High Court, Telangana, Transgender

  ఉత్తమ కథలు