హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ugadi 2022: రాజ్​భవన్​లో జరిగిన ఉగాది వేడుకల్లో అపశృతి.. ఘటనపై గవర్నర్​ తమిళిసై ఆగ్రహం

Ugadi 2022: రాజ్​భవన్​లో జరిగిన ఉగాది వేడుకల్లో అపశృతి.. ఘటనపై గవర్నర్​ తమిళిసై ఆగ్రహం

Governor tamilisai

Governor tamilisai

ఉగాదిని (Ugadi celebration) పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ ఉగాది వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

తెలంగాణ రాజ్‌భవన్‌ (rajbhavan)లో జరుగుతున్న ఉగాది వేడుకల్లో (Ugadi celebrations) అపశృతి చోటు చేసుకుంది. స్టేజి కింద ప్రముఖుల దగ్గర గవర్నర్ కూర్చొనే కుర్చీ పక్కకు జరగడంతో  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilsai Soundarajan) కింద పడిపోయారు. అయితే తక్షణమే తేరుకొని అదే కుర్చీలో గవర్నర్ కుర్చున్నారు . ఈ ఘటనతో తన వ్యక్తిగత సిబ్బంది (Personal staff)పై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్,. మంత్రులు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వేడుకలకు హాజరు కావాలని గవర్నర్ ఆహ్వాన పత్రాలు (Invitations) పంపారు. కానీ వీరు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.

తెలంగాణ‌ (Telangana)లో గ‌త కొన్ని రోజులుగా రాజ‌కీయాలు కీల‌క మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో టీఆర్​ఎస్​ అధినేత (CM KCR) వేస్తున్న అడుగులు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ సీఎం-గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai soundararajan) మ‌ధ్య దూరం పెరుగుతోందా? అనే చ‌ర్చ మొద‌లైంది. దీనికి స్ప‌ష్టమైన స‌మాధానం రాక‌పోయినా.. అవుననే రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కొద్దిరోజుల ముందే గవర్నర్​ తమిళిసైకి మేడారం జాతర (Medaram jatara)లో మంత్రులు స్వాగతం పలకడానికి రాకపోవడం చర్చనీయాంశం అయింది. ముంబైలో ఉద్ధవ్​ ఠాక్రేను కలవడానికి వెళ్లే ముందు కేసీఆర్​ బీజేపీకి జలక్ ఇచ్చారనే చెప్పవచ్చు. ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లో (Telangana assembly) గవర్నర్​ ప్రసంగం లేకుండా జరగడం చర్చనీయాంశమైంది. అయితే ఇపుడు ఈ వివాదాలకు ఉగాది వేడుక కూడా కేంద్ర బిందువైంది.

ఫ్లెక్సీలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఫొటోలు మాత్రమే..

ఇక ఈ శుభకృత్ నామ సంవత్సరం ముందస్తు ఉగాది వేడుకలను రాజ్​భవన్ (Rajbhavan)​లో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.  ఈ ఉగాది ఉత్సవాలకు కేసీఆర్​, ఆయన మంత్రివర్గంలోని వాళ్లు ఎవరూ రాలేదు. అంతేకాకుండా రాజ్​భవన్​లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ (President), ప్రధాని నరేంద్ర మోదీ (Prime minister Narendra Modi), గవర్నర్ (Governor) ఫొటోలు మాత్రమే ఉండటం గమనార్హం. ఫ్లెక్సీపై సీఎం కేసీఆర్ ఫొటో (CM KCR Photo) కనిపించకపోవడంపై చర్చనీయాంశమైంది.

హాజరైన రేవంత్ రెడ్డి , రఘునందన్​ రావు..

కార్యక్రమానికి ఎమ్మెల్యే జయ్ పాల్ యాదవ్  హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, కాంగ్రెస్​ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఇతరులు పాల్గొన్నారు. ప్రధానంగా సీఎం – గవర్నర్ మధ్య దూరం పెరుగుతోందా ? అనే టాక్ వినిపిస్తోంది. రాజ్ భవన్, ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరుగుతోందనే చర్చ జరుగుతోంది.

First published:

Tags: CM KCR, Governor Tamilisai, Raj bhawan, Tamilisai Soundararajan, Telangana

ఉత్తమ కథలు