ఫోన్ లో మాట్లాడొద్దన్నందుకు ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా ఉంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల కుమార్తె (16), కుమారుడితో కలసి అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. విష్ణు(45) హోంగార్డుగా చేస్తున్నారు. కూతురు స్రవంతి(16) సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. కరోనా కారణంగా పది పరీక్షలు రద్దు కావడంతో అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన దగ్గర నుంచి ఆ బాలిక ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే కొంతకాలంగా కూతురు ఎవరితోనో ఆమె ఫోన్లో మాట్లాడుతుండటాన్ని వారి తల్లిదండ్రులు గమనించి మందలించారు. బాలికలో మార్పు రాకపోగా శుక్రవారం తిరిగి అపరిచితునితో మాట్లాడుతుండటంతో గట్టిగా హెచ్చరించారు. దీంతో వేదనకు గురైన బాలిక శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో వారు నిద్రించాక కిరోసిన్ సీసా తీసుకొని, కుటుంబ సభ్యులు బయటకు రాకుండా గడియపెట్టి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.
కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి డాగ్, క్లూస్ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించారు. పోలీసులు ఘటన స్థలం వద్ద మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మొదట ఖాళీ ప్రదేశంలో బాలిక మృతదేహం కనిపించడంతో దుండగులు బాలికను సజీవదహనం చేసి ఉండొచ్చనే వదంతులు వచ్చాయి.
పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ముందుగా అనుమానించారు. దీంతో స్థానికులు భారీగా ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా బాలిక కిరోసిన్ సీసాతో ఒంటరిగా వెళ్లడం కనిపించింది. దీంతో పోలీసులు ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, College student, Crime, Crime news, Tenth class