హోమ్ /వార్తలు /తెలంగాణ /

Jubileehills gang rape:  జూబ్లీహిల్స్​ మైనర్​ గ్యాంగ్​ రేప్​ కేసులో కీలక అప్​డేట్​.. బయటికొచ్చిన నిందితులు..

Jubileehills gang rape:  జూబ్లీహిల్స్​ మైనర్​ గ్యాంగ్​ రేప్​ కేసులో కీలక అప్​డేట్​.. బయటికొచ్చిన నిందితులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూబ్లీహిల్స్​ మైనర్​ గ్యాంగ్​ రేప్​ ( Jubileehills gang rape) కేసులో మైనర్ బాలికపై రేప్ కేసులో కీలక అప్​డేట్​. ఘటనకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నలుగురు బయటికి వచ్చేశారు.

  జూబ్లీహిల్స్​ మైనర్​ గ్యాంగ్​ రేప్​ ( Jubileehills gang rape) కేసులో మైనర్ బాలికపై రేప్ కేసులో నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ (Bail) మంజూరు చేసింది. దీంతో జువైనల్ హోం నుండి నలుగురు మైనర్లు బయటకు వచ్చారు. అయితే ఇదే కేసులో ఉన్న ఓ ఎమ్మెల్యే కొడుకు మాత్రం ఇంకా జైలులోనే ఉన్నాడు. ఎమ్మెల్యే కొడుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కొడుకు బెయిల్ మంజూరు కానందున ఆయన ఇంకా Juvenile హోంలోనే ఉన్నాడు.

  ఏం జరిగింది?

  మే 28న కొందరు విద్యార్థులు జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ (Amnesia Pub)లో పార్టీ చేసుకున్నారు. కొందరు స్నేహితులూ ఆ పార్టీకి వచ్చారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి బాలిక పబ్‌కు వెళ్లింది. పబ్‌లో ఐదుగురు వ్యక్తులు ఆ బాలికతో మాటలు కలిపారు. ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్‌ వేసుకున్నారు. ఇంటి దగ్గర దింపుతా మంటూ కారు ఎక్కించుకున్నారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి ప్రాంతంలోని గల్లీల్లోకి తీసుకెళ్లి.. ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి పబ్‌ వద్ద వదిలేసి వెళ్లారు.

  ఇంటికి వెళ్లిన బాలిక ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు నిలదీశారు. తనను కొందరు వేధించారని చెప్పడంతో 31న జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ‘భరోసా’ కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళా అధికారులు, నిపుణులు సేకరించిన వాంగ్మూలం, వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా తేలింది.

  ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు..

  అయితే నిందితులను పట్టుకోవడంలో పోలీసులు కొంత అలసత్వం ప్రదర్శించారు. దీంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ.. పబ్ దగ్గర బాలికను (Mionor girl) కారులో తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనలో హోంమంత్రి మనవడు ఉన్నాడని సంచలన ఆరోపణలు చేశారు. అయితే కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. డీసీపీ మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించాల్సి వచ్చింది.

  ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఎక్కువగా ప్రజా ప్రతినిధులకు చెందిన పిల్లలు. మైనర్​ పై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరు మేజర్ కాగా, ఐదుగురు మైనర్లు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఉపయోగించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మరో వైపు వాహనంలోని కీలక సాక్ష్యాలను కూడా సేకరించారు ఈ కేసు విషయమై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. నిందితులను కాపాడే ప్రయత్నాలు చేశారని ఆందోళనకు కూడా దిగారు. నిందితులకు పోటెన్సీ టెస్టులు కూడా నిర్వహించారు. నిందితులు ఈ కేసులో పాల్గొన్నట్టుగా శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. ఈ కేసులో 400 పేజీలతో పోలీసులు చార్జీషీట్ ను సిద్దం చేశారని సమాచారం.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Hyderabad, Jubilee Hills Gang rape case

  ఉత్తమ కథలు