Pregnant: ప్రసవ వేదనతో గర్భిణి.. మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్‌, హోంగార్డ్.. వీడియో వైరల్..

గర్భిణికి సహాయం చేస్తున్న కానిస్టేబుల్, హోం గార్డు

Pregnant: పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి సహాయం చేసి కానిస్టేబుల్‌, హోం గార్డ్ మానవత్వాన్ని చాటుకున్నారు. గాంధీ ఆస్పత్రికి వచ్చి నడవలేని స్గితిలో ఉన్న గర్భిణిని.. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కిరణ్, ఇమ్రాన్ లోపలికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  హైదరాబాద్(Hyderabad) లోని గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్, హోం గార్డ్‌ను డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అభినందించారు. ఎందుకంటే.. ఆసుపత్రిలో చెక్ అప్ కోసం వచ్చిన ఓ గర్భిణి నడవలేని స్థితిలో ఉంది. ఆమెను అక్కడే విదుల్లో ఉన్న కానిస్టేబుల్ కిర‌ణ్, హోంగార్డ్ ఇమ్రాన్ గ‌మ‌నించారు. న‌డ‌వ‌లేని స్థితిలో ఉండి, పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న ఆమెను వారిద్ద‌రూ త‌మ చేతుల మీద ప్ర‌సూతి వార్డులోకి మోసుకెళ్లారు.

  Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇంత దారుణమా.. చెవి, ముక్కులో విషాన్ని లోపలికి పంపి.. చివరకు..

  ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన డీజీపీ మహేందర్ రెడ్డి.. కానిస్టేబుల్ కిరణ్, ఇమ్రాన్‌లను ప్రశంసించారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం ప్రసవ వేదనతో ఆస్పత్రికి వెళ్లిన గిరిజన మహిళ వైద్య సిబ్బంది లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. కనీసం పట్టణానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామనుకుంటే వాగు దాటలేని పరిస్థితి గర్భిణీని వేదనకు గురి చేసింది. అసలే వర్షాలు విపరీతంగా కురుస్తున్న వేళ మహిళలే ఎక్కువగా కష్టపడుతుంటారు. అలాంటిది.. గర్భిణి దీని వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజారాం గ్రామానికి చెందిన బోరం భీమయ్య, శాంతక్కల కూతురు బుర్స శిరీషకు బుధవారం ఇంటి వద్ద నొప్పులు మొదలయ్యాయి.

  Sexual Assault: ఆమె అనారోగ్యానికి గురైంది.. ఆ రాత్రి గదిలో ఒంటరిగా రెస్టు తీసుకుంది.. తెల్లారి చూసేసరికి షాక్..


  ఇరుగుపొరుగు వారి సాయంతో అవ్వాల్‌ కమిటీ అంబులెన్స్‌లో వేమనపల్లి పీహెచ్‌సీకి తరలించారు. 24 గంటల వైద్య సదుపాయం అందించాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది లేరు. కాంట్రాక్ట్‌ వర్కర్‌ బాపు ఒక్కడే ఉన్నాడు. శిరీష ఆరోగ్య పరిస్థితిని చూసి వైద్యాధికారి కృష్ణకు ఫోన్‌లో సమాచారం అందించగా, ఆయన చెన్నూర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించమని సలహా ఇచ్చారు. అదే అంబులెన్స్‌లో ఐదు కిలోమీటర్ల దూరంలోని నీల్వాయి వాగు వంతెన వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అప్రోచ్‌ రోడ్డు బురదమయంగా ఉండడంతో అంబులెన్స్‌ బురదలో కూరుకుపోయింది. రాత్రి 10 గంటలకు వాగు వద్దకు వెళ్లిన అంబులెన్స్‌ రాత్రి 12.30 గంటల వరకు కూడా బురదలో నుంచి బయటకు రాలేదు.

  Lovers Serious Decision: కులాలు వేరుకావడమే వారు చేసిన తప్పా.. కుల గజ్జి ఎంత పని చేసిందో చూడండి..


  దీంతో అంబులెన్స్‌లో ఉన్న గర్భిణిని డ్రైవర్‌ నరేష్, మరో డ్రైవర్‌ బుర్స భాస్కర్, కుటుంబ సభ్యులు చేతులపై ఎత్తుకెళ్లి వంతెన మీదుగా మామిడితోట అవతలి వైపు మోసుకొచ్చారు. అక్కడ వేచి ఉన్న 108 అంబులెన్స్‌ సహాయంతో చెన్నూర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇలా ఒక్కో సమయంలో మనుషుల్లో మానవత్వం బయట పడుతుంటుంది.
  Published by:Veera Babu
  First published: