HYDERABAD THE CITY IS THE BEST CITY FOR JOB SEEKERS THE SERVEY REPORT FULL DETAILS HERV BK VB
Hyderabad Best City: హైదరాబాద్ కు మరో అరుదైన ఘనత.. జాబ్ అన్వేషకుల విషయంలో ఆసక్తికర వివరాలు..
ప్రతీకాత్మక చిత్రం
Jobs In Hyderabad: మహమ్మారి కోవిడ్ మరియు ఆర్థిక కార్యకలాపాలు తగ్గుదల హైదరాబాద్‌లో జాబ్ మార్కెట్ పై ప్రభావం చూపించలేకపోయాయి. ఇటీవలి తాజా రిపోర్ట్ ప్రకారం జాబ్స్ కోసం వెతుకుతున్న మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా కొనసాగుతోంది.
మహమ్మారి కోవిడ్ మరియు ఆర్థిక కార్యకలాపాలు తగ్గుదల హైదరాబాద్‌లో జాబ్ మార్కెట్ పై ప్రభావం చూపించలేకపోయాయి. ఇటీవలి తాజా రిపోర్ట్ ప్రకారం జాబ్స్ కోసం వెతుకుతున్న మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా కొనసాగుతోంది. నగరంలో అనేక స్వదేశీ కంపెనీలతో పాటు ఇంటర్నేషనల్ సంస్థలు ఉండడంతో హైదరాబాద్ జాబ్ మార్కెట్‌కు అనుకూలంగా ఉన్న నగరంల్లో మూడో స్థానం సంపాదించుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటలైజేషన్, ఆటోమేషన్ మరియు లాక్డౌన్ వంటి సవాళ్లను మార్కెట్ ఎదుర్కొన్నప్పటికీ, ఉద్యోగాల కోసం వెతుకుతున్న అగ్ర నగరాల్లో హైదరాబాద్, ముంబై మరియు బెంగళూరులు టాప్ ప్లేస్ లో ఉన్నాయని జాబ్ సైట్ ఇన్‌డీడ్ అనే సంస్థ చేసిన సర్వేలో తెలింది.
కేవలం ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్లే కాకుండ, కంపెనీలు కూడా ఈ మూడు నగరాల్లో ఎక్కువ మంది ప్రతిభావంతులను నియమించుకోవడానికి ఇష్టపడుతున్నాయని వారి సర్వేలో తెలింది. గతంలో పూణె మరియు చెన్నైలు అత్యధికంగా జాబ్స్ వెతుకుతున్న నగరాలుగా ఉన్నప్పటికి తాజా నివేదిక ప్రకారం హైదరాబాద్, ముంబై, బెంగళూరులు మొదటి స్థానంలో ఉన్నాయని సంస్థ తెలిపింది. వాస్తవానికి కోవిడ్ తరువాత అన్ని రంగాల్లో అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఉద్యోగ నియమాకాల్లో అనేక ఆసక్తికరమైన మార్పులు వచ్చాయి.
దీంతోపాటు డిజిటలైజేషన్ టెక్ రంగాల్లో ఉద్యోగాలు గణనీయంగా పెరగడంతోపాటు ఇంత కష్ట సమయంలో కూడా అనేక కొత్త జాబ్ ప్రోఫైల్స్ కూడా రూపాంతరం చెందాయని జాబ్ సైట్ తెలియజేసింది. వాటిల్లో ప్రధానంగా ప్రొఫెసర్, లోన్ ఆఫీసర్లు, రిక్రూట్మెంట్ మేనేజర్లు మరియు ప్యాకేజర్ల వంటి ఉద్యోగాలకు అధిక డిమాండ్‌ని ఉందని ఆ సంస్థ తమ సర్వేలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది డిసెంబర్ మధ్య 'ప్రొఫెసర్స ఉద్యోగం కోసం జాబ్ పోస్టింగ్‌లు 2,448 శాతం పెరిగాయని ఈ సంస్థ తమ సర్వేలో తెలిపింది. 'ప్రొఫెసర్' కోసం క్లిక్‌లు కూడా ఒక్కొక్కరికి 1,576 శాతం చొప్పున పెరిగినట్లు వారు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఫ్రెషర్స్ కు ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరిగాయని సంస్థ తమ నివేధికలో తెలిపింది. అక్టోబర్ 2020తో పోల్చితే అక్టోబర్ 2021లో 30 శాతం ఫ్రెషర్స్ కు ఉద్యోగ అవకాశాల్లో పెరుగుదల కనిపించింది. కోవిడ్ కష్ట సమయంలో కూడా హైదరాబాద్ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషకులకు సరైన నగరంగా నిలిచింది. నగరం ఐటీ హాబ్ గా ఉండడంతో నిత్యం అనేక అవకాశాలు హైదరాబాద్ లో ఉంటాయని సంస్థ తమ సర్వేలో తెలిపింది. కోవిడ్ సమయంలో ఫ్రెషర్స్ కూడా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగడం కూడా జాబ్ మార్కెట్ కు మంచి సంకేతం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.