HYDERABAD THE CASE HAS BEEN FILED ON THE STATUE OF EQUALITY IN MUCHHINTHAL BY THE OFFICIALS OF THE DEPARTMENT OF WEIGHTS AND MEASURES BK PRV
Statue of Equality: మరో వివాదంలో సమతామూర్తి విగ్రహం.. కేసు నమోదు చేసిన తూనికలు కొలతల అధికారులు.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ (Hyderabad) లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ (Statue of Equality)పై తూనికలు, కొలతల అధికారులు (Officers of weights and measures) కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన సామాజిక కార్యకర్త వినయ్ వంగాల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
హైదరాబాద్ (Hyderabad) లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ (Statue of Equality)పై తూనికలు, కొలతల అధికారులు (Officers of weights and measures) కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన సామాజిక కార్యకర్త వినయ్ వంగాల శనివారం ముచ్చింతల్ (Muchhinthal )లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించారు. ఆ సమయంలో అక్కడ విక్రయించే ప్రసాదం ప్యాకెట్ (Prasad packet)ను కొనుగోలు చేశారు. ప్యాకెట్‌పై తయారీ, గడువు తేదీలు (Manufacture dates) లేకపోవడం చూసి అక్కడ అధికారులను ప్రశ్నించాడు. అయితే వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో తూనికలు కొలతల అధికారులకు (Officers of weights and measures) సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు పరిశీలించి మెట్రాలజీ యాక్ట్ (Metrology Act) 2009 లోని నింబంధనలను ఉల్లంఘించినందుకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీపై కేసు నమోదు చేశారు. నిర్వాహకులు సందర్శకులకు ఇస్తున్న ప్రసాదం ప్యాకెట్‌పై వేసిన బరువు (Weight)కు అందులో ఉన్న బరువుకు కూడా చాలా వ్యత్యాసం ఉండటం గమనించారు అధికారులు.
సామాజిక కార్యకర్త వినయ్ వంగాల (Social Activist Vinay Vangala) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ శనివారం నేను ముచ్చింతల్ లో ఉన్న సమతామూర్తి విగ్రహంపై ప్రసాదం ప్యాకెట్లపై కొనుగులు చేశాను. అయితే నిర్వాహకులు ఇచ్చిన ప్రసాదం ప్యాకెట్ పై బరువు, తయారీ, గడువు తేదీలు ఎక్కడ కూడా రాయలేదు. దీంతో నేను లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కు మొయిల్ చేశాను. అధికారులు వెంటనే స్పందించి కేసు కూడా నమోదు చేశారు”అని తెలిపారు .
ప్రసాదం
రంగారెడ్డి జోన్ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వినయ్ వంగాల ఫిర్యాదు మేరకు మేం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి నిర్వాహకులు అమ్ముతున్న ప్రసాదం ను పరిశీలించాం. అయితే తనిఖీల సమయంలో, లీగల్ మెట్రాలజీ చట్టం 2009 సెక్షన్లు 10,11,12, అండ్ 8/25 ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేయబడింది" అని తెలిపారు.
కేసు కాపీ
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ 216 అడుగుల వైష్ణవ సన్యాసి శ్రీ రామానుజాచార్యుల విగ్రహం. దీనిని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ విగ్రహం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్ద 45 ఎకరాల సుందరమైన జీయర్ ఇంటిగ్రేటెడ్ వేద అకాడమీ (జీవా)లో ఉంది. వైష్ణవ సన్యాసి రామానుజాచార్య 1000వ జయంతి సందర్భంగా నిర్మించబడింది. ఈ విగ్రహాం కూర్చున్న స్థితిలో ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం, మొదటిది థాయిలాండ్‌లో కూర్చున్న స్థితిలో ఉన్న బుద్ధ విగ్రహం. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక విగ్రహంపై ఇప్పుడ కేసు నమోదు కావడం సర్వత్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పర్యాటకులకు ఇచ్చే ప్రసాదంలో కొలతల్లో హెచ్చు తగ్గుల గురించి జరిగిన సంఘటన పై చర్యలు తీసుకుంటామని అంటున్నారు రామానుజాచార్యుల విగ్రహ నిర్వహకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.