ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) అప్పుడప్పుడు బ్రీత్ ఎనలైజర్(Breath Analyzer) తో వాహనదారులకు టెస్ట్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బ్రీత్ ఎనలైజర్ లో ఉదమంటూ ఓ వ్యక్తిని అడగ్గా అతడు దాన్ని పట్టుకొని పారిపోతాడు. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad) లోని కొండాపూర్(Kondapur) లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తుల బైక్ పై వెళ్తున్నారు. అక్కడ ఒక ప్రదేశంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాళ్ల బైక్ ను కూడా పోలీసులు ఆపారు. వాళ్లు మద్యం సేవించారా లేదా అనేది తెలుసుకోవడానికి బ్రీత్ ఎనలైజర్ ను అందులో ఒకరి నోటి వద్ద పెట్టారు.
అతడికి ఏమనిపించిందో ఏమో గానీ పోలీసుల చేతిలో నుంచి ఆ బ్రీత్ ఎనలైజర్ ను పట్టుకొని అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదిలా ఉండగా.. ఇలాంటి సందర్భాలో అప్పడప్పుడు వాళ్లకు జరగుతూనే ఉంటాయి. రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు కొందరు మందుబాబులు ఇలా చుక్కలు చూపిస్తుంటారు. తాగిన మైకంలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ చిందులు తొక్కుతూ పోలీసుల సహనాన్ని పరీక్షిస్తుంటారు. ఇదంతా రోజూ పోలీసులకు ఎదురయ్యే అనుభవాలే. ఓ రోజు సోషల్ మీడియాలో ఒక పోలీసును పట్టుకొని.. సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా నీకు.. అంటూ అడిగిన వీడియో తెగ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
ఈ ఘటనతో అతడు పెద్ద పాపులర్ కూడా అయ్యాడు. అయితే తాజాగా జరిగిన ఈ బ్రీత్ ఎనలైజర్ ఎత్తుకెళ్లిన దొంగల గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈఘటన అససలు ఏం జరిగిందంటే.. కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ సమీపాన రాత్రి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ నర్సింహారావు నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. రాత్రి 11.45 సమయంలో మియాపూర్ వైపు నుంచి ద్విచక్ర వాహనం మీద వస్తోన్న ఇద్దరిని వారు ఆపారు.
బైకు నడుపుతున్న వ్యక్తికి శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు హోంగార్డు తన చేతిలో ఉన్న బ్రీత్ ఎనలైజర్‌ను యువకుడి నోటికి దగ్గరలో పెట్టాడు. ఇంతలో సదరు యువకుడు హోంగార్డు చేతిలో ఉన్న యంత్రాన్ని లాక్కొని వేగంగా బైకు మీద దూసుకెళ్లి మాయమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫిర్యాదు అందుకున్న మాదాపూర్ పోలీసులు ఆకతాయిలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drinkers, Hyderabad, Rules break, Traffic fine