• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD THE BODY OF A TENTH CLASS STUDENT WAS FOUND BURNT ON THE SIDE OF THE ROAD VB

Tenth Class Student Dead Body: రోడ్డు పక్కన కాలిన స్థితిలో పదో తరగతి విద్యార్థిని మృతదేహం.. కారణం అదేనా?

ప్రతీకాత్మక చిత్రం

Tenth Class Student Dead Body: అర్థరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఒక బాలిక.. తెల్లవారేసరికి స్థానికులకు శవంగా కనిపించింది. ఘట్‌కేసర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బాలిక మృతదేహం కనిపించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా కారణంగా వరుసుగా రెండో ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే వారికి ఇప్పటికే జీపీఏ గ్రేడ్ లను కూడా ఎస్ఎస్సీ బోర్డు కేటాయించింది. ఆగస్టులో వారికి లాంగ్ మెమోలను కూడా జారీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది. అయితే లాక్ డౌడ్ కారణంగా పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు ఇంటి దగ్గరే ఉంటున్నారు. రాత్రి సమయంలో ఓ విద్యార్ధిని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంది. వారి మీద కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తెలిసిన వారికి ఫోన్ చేసి అడిగినా ఆ బాలిక ఆచూకీ మాత్రం తెలియలేదు. రాత్రంతా తల్లిదండ్రులు ఆమె రాక కోసం ఎదురుచూశారు. అనుకోని సంఘటన ఏమైనా జరిగిఉంటుందా అని భయాందోళనకు గురయ్యారు. తెల్లారేసరికి ఆ బాలిక స్థానికులకు శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ఆ బాలిక తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులకు ఇంట్లో నుంచి రాత్రి బయటకు వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు, బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    మహబూబ్ నగర్ జిల్లా ఉంద్యాలకు చెందిన విష్ణు, పద్మలు దంపతులు. వారికి ఒక కూతురు స్రవంతి ఉంది. విష్ణు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్రవంతి పదో తరగతి పాస్ అయ్యింది. ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకొని ఆమె బయటకు వెళ్లింది. ఘట్‌కేసర్‌లో దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతిచెందింది. సర్వీస్ రోడ్డు పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకొని పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

    పోలీసులు ఆమెది మహబూబ్ నగర్ జిల్లా వాసిగా గుర్తించి బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు తల్లిదండ్రులు విష్ణు, పద్మ పోలీసులకు తెలిపారు. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఎవరైనా చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Veera Babu
    First published: