HYDERABAD TENSION OVER NANDAMURI MEGA FANS SUSPENSE OVER TRIPULAR MOVIE OVER WHICH HERO IS MORE IMPORTANT SNR
RRR:ఇద్దరిలో ఎవరు గొప్ప..ట్రిపులార్‌పై ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌లో చర్చ రచ్చ
(ప్రతీకాత్మకచిత్రం)
FANS WAR:ఇద్దరు అగ్రహీరోలతో తెరకెక్కించిన ట్రిపులార్ సినిమాపై ఫ్యాన్స్‌లో కొత్త కన్ఫ్యూజన్ నెలకొంది. ఇందులో ఎవరి పాత్ర పెద్దగా, హీరోయిజనాన్ని తలపించేలా ఉంటుందన్న ఆసక్తిపై సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ట్రిపులార్(RRR)సినిమా రిలీజ్‌పై ఇప్పటి వరకు ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూసింది. మూవీ రిలీజ్‌కి సర్వం సిద్ధమవడంతో కొత్త టాపిక్‌పై సోషల్ మీడియా(Social media)లో చర్చ జరుగుతోంది. సినిమాలో ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి నటించడంతో మెగా(Mega) అభిమానులు, నందమూరి(Nandamuri) ఫ్యాన్స్‌లో ఒకటే టెన్షన్ కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ramcharan) అభిమానులు ట్రిపులార్ సినిమాలో ఎవరి పాత్ర స్ట్రాంగ్‌గా ఉంటుంది ? ఎవరి పాత్ర సినిమాలో ఎక్కువ సేపు ఉంటుంది ?ఎవరికి ఎక్కువ పాటలు ఉంటాయి ? ఎవరికి ఎక్కువ ఫైట్లు పెట్టి ఉంటారు ? అనే ఆసక్తి ఇద్దరు హీరోల అభిమానుల్లో నెలకొంది. సుమారు దశాబ్ధాల క్రితం సినిమా పరిశ్రమకు రెండు కళ్లుగా ఉన్నటువంటి ఎన్టీఆర్(NTR), ఏఎన్ఆర్(ANR)కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఒకటి రెండు కాదు సుమారు 10సినిమాలకుపైగా చేశారు. కాని ఆ తర్వాత జనరేషన్లో ఆ రెండు ఫ్యామిలీలకు చెందిన అగ్రహీరోలు చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna)కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇద్దరు హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉన్నప్పటికి ..అభిమానులు మాత్రం వేర్వేరు అభిమాన సంఘాలుగా వేరుబడటంతో సినిమా ప్రారంభంలో ఎవరి పేరు ముందు వస్తుంది అనే సందేహం నుంచి మా హీరోకి ఎన్నిసీన్లు, ఎన్ని ఫైట్లు పెట్టి ఉంటారని ఫ్యాన్స్ ఆలోచించే స్థాయిలో ఇద్దరి అభిమానుల మధ్య ఉత్కంఠ ఉండేది. సినిమా టిక్కెట్లు చిరగకుండానే ఎక్కడ సినిమా తెర చిరిగిపోతుందో అనే భయం నిర్మాతలు, దర్శకుల్లో ఉండటంతో నందమూరి, మెగా హీరోలతో మల్టీ స్టారర్ చేయడానికి ఎవరూ సాహసించలేదు.
అభిమానుల్లో ఒకటే టెన్షన్..
అలాంటి రెండు ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు అగ్రహీరోల నటవారసులు, దశాబ్ధాల కాలం తర్వాత ఒకే సినిమాలో కలిసి నటించడంతో మరోసారి ఇద్దరు హీరోల అభిమాన సంఘాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకరి ఆడియో ఫంక్షన్‌కి మరొకరు గెస్ట్‌గా వెళ్తేనే అరుపులు, కేకలతో విసిగించే అభిమానులు ట్రిపులార్ సినిమాలో ఇద్దరి పాత్రలు డిజైన్ చేసిన తీరుతో సంతృప్తి చెందుతారా లేక మొదటి ఆట ముగియగానే సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఆట మొదలుపెడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి కత్తిలాంటి ఇద్దరు హీరోలతో డైరెక్టర్ రాజమౌళి సాము చేయడంలో సక్సెస్ అవుతారా ఫ్యాన్స్‌ని సాటిస్వే చేస్తారా లేక ఏ అభిమానవర్గం నుంచి వ్యతిరేతకను మూటగట్టుకుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
షో పడితే కాని తెలియదు..
ప్యాన్ ఇండియా మూవీగానే కాకుండా రాజమౌళి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ట్రిపులార్ సినిమాపై మరో టాక్ కూడా వినిపిస్తోంది. సినిమా రిలీజ్‌కి ముందే రాజమౌళి ప్రత్యేకంగా ప్రభుత్వ పెద్దల్ని కలవడం వెనుక ప్రత్యేకత లేకపోలేదని టాక్ నడుస్తోంది. తగిన కారణం తగినట్లుగా చెప్పగలిగే మేధావులు ఉండగా దిగులెందుకు దండుగ అని సినీ క్రిటిక్స్ సైతం అంటున్నారు. అందుకే టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. అధికారికంగా 75/- పెంచారు. దాదాపు అన్ని థియేటర్ల లో ట్రిపులార్ సినిమా విడుదల చేస్తున్నారు. అధికారిక షోలు, టికెట్ల ధరల పెంపు విషయంలోసర్కార్ చూసీ చూడనట్లు ఉంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. సినిమాపై నెలకొన్న ఆసక్తి, పబ్లిసిటీని క్యాష్ చేసుకోవాలన్న దర్శక,నిర్మాతల ఆలోచనలు చూస్తుంటే ట్రిపులార్ సినిమా టికెట్ ధర 500 రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఇక సినిమా 25రిలీజవుతుండగా ఈనెల 24వ తేది రాత్రి ఆట నుంచే బెనిఫిట్, అదనపు షోలకు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.