హైదరాబాద్ (Hyderabad) లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ను మంత్రి కేటీఆర్ (Minister Ktr) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) కొడుకు అనిందిత్ (Anindhith), హీరో నిఖిల్ (Hero Nikhil) కూడా పాల్గొన్నారు. అలాగే రేసులో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొడుకు అనిందిత్ రెడ్డి (Anindhith Reddy) కి మంత్రి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా అనిందిత్ రెడ్డి హైదరాబాద్ (Hyderabad) బ్లాక్ బర్డ్స్ టీమ్ నుంచి బరిలో ఉన్నాడు.
KTR, the real statesman ????.
One can see @KTRTRS wishing Konda Vishweshawar Reddy's son who is a participant in Indian Racing League. Hope BJP and Congress leaders of this state reciprocate such behavior ????.#Hyderabad pic.twitter.com/976MwPtdFS — Varun Thakkallapalli (@varuntrs58) November 19, 2022
అయితే అనిందిత్ రెడ్డి రేసింగ్ లో పాల్పడడం మొదటి సారి కాదు. అతనికి రేసింగ్ లో 7 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో యూరో JK 16 ఛాంపియన్ షిప్, 2017లో యూరో జేకే ఛాంపియన్ షిప్ లలో విన్నర్ గా కూడా నిలిచాడు. అంతేకాదు మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా 2017 మోటార్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
కాగా ఈ ఫార్ములా రేసును హైదరాబాద్ లో నిర్వహించడం తొలిసారి. ఈ రేసింగ్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు పాల్గొంటాయి. ఆరు జట్ల నుంచి 12 కార్లు..24 మంది డ్రైవర్లు రేసులో ఉన్నారు. ఈ పోటీలను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఇక లీగ్ ఫార్మాట్ ప్రకారం పోటీలు 4 రౌండ్లలో జరగనున్నాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ రౌండ్లకు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తుంది. అలాగే 2, 3 రౌండ్లు మాత్రం చెన్నైలో కొనసాగనున్నాయి. ప్రతి రౌండ్ కూడా రెండు రోజుల పాటూ జరగనుంది. నేడు 3 స్ప్రింట్ రేసులు నిర్వహించనున్నారు. మూడు స్ప్రింట్ రేసులో టాపర్ గా నిలిచిన జట్టుకు 25 పాయింట్లు లభిస్తాయి. రెండో స్థానంలోని జట్టుకు 18, మూడో శానంలోని టీమ్ కు 15 పాయింట్లు లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAR, Hero nikhil, Hyderabad, Konda Vishweshwar reddy, KTR, Minister ktr, Telangana