టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె నారంగ్ ఇవాళ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నారాయణ్ దాస్ కె నారంగ్ ఏషియన్ ఫిలిమ్స్ మరియు ఏషియన్ థియేటర్స్ గ్రూప్ అధినేతగా ఉన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో ఫైనాన్సియర్స్ గా సుస్థిర స్థానం సంపాదించుకున్న నారాయణదాస్ నారంగ్ గారు 600కు పైగా సినిమాలకు ఫైనాన్సర్‌గా ఉన్నారు. అలాగే వందలాది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఛైన్ ఆఫ్ థియేటర్స్ అయిన ఏసియన్ సినిమాస్ ను విజయవంతంగా నడిపిస్తూ.. పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో లవ్ స్టోరీ(Love Story),లక్ష్య(Lakshya) సినిమాలను కూడా నారాయణదాస్ నిర్మించారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఘోస్ట్, ధనుష్ తో ఒక సినిమాని నిర్మిస్తున్నారు. ఫైనాన్సర్‌గా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా సిని పరిశ్రమకు సేవలందించారు నారాయణ దాస్ కె నారంగ్. ఆయన మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Film chamber, Tollywood