Home /News /telangana /

HYDERABAD TELUGU CINEMA INDUSTRY JUNIOR ARTIST COMMITTED SUICIDE IN HYDERABAD SU

Junior Artist Suicide: ఆమె తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్.. అలా జరగడంతో ఆత్మహత్య.. గదిలో నుంచి..

అనురాధ

అనురాధ

కావలి అనురాధ తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Cinema Industry) జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంది. అయితే ఆమె ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది.

    ఆమె తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Cinema Industry) జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంది. కొంతకాలంగా ఓ వ్యక్తి సహజీనం చేస్తుంది. అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుమంది. కానీ అతడు మాత్రం పెళ్లి పేరుతో ఆమెతో సహజీవనం చేసి.. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో నివాసం ఉంటున్న కావలి అనురాధ (22) సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా (Junior Artist )పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా అనురాధ, కిరణ్ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.

    అయితే ఇటీవల కిరణ్ తనను పెళ్లి చేసుకుంటాడని భావించిన అనురాధకు చేదు అనుభవం ఎదురైంది. కిరణ్‌ ఇటీవల మరో యువతితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడని అనురాధకు తెలిసింది. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఆమెను ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనురాధ తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

    South Central Railway: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ .. అక్టోబర్ 1 నుంచి భారీ మార్పులు.. ఈ వివరాలు తప్పక తెలుసుకోండి..

    అయితే రెండు రోజుల తర్వాత అనురాధ గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోగా అనురాధ మృతిచెంది కనిపించింది. అనురాధ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సబంధించి మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడు కిరణ్‌పై ఐపీసీ 306, 509, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    Peddapalli: మేనబావను ప్రేమించిన యువతి.. కానీ అలా జరిగేసరికి తట్టుకోలేకపోయింది..

    TS PGECET 2021: తెలంగాణ పీజీ ఈసెట్‌‌లో అర్హత సాధించిన వారికి కీలక అప్‌డేట్.. పూర్తి వివరాలు ఇవే..

    ఆదిలాబాద్‌లో ప్రేమించినవాడు మోసం చేశాడని..
    ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్‌ రవీందర్, గంగుబాయి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకన్నారు. అయితే ఇటీవల రవీందర్ వేరే యువతిని వివాహం చేసుకుంటానని గంగుబాయికి తెలిపాడు. దీంతో గంగుబాయి మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే ఈ నెల 24 పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గంగుబాయి తల్లి శోభబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు రవీందర్‌పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Hyderabad, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు