ఫిబ్రవరిస్తే సాధారణంగా చలి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ఐతే తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితులు రానున్నాయి. తెలంగాణ (Telangana)లో ఫిబ్రవరిలో చలితీవ్రత (Cold Wave) మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బుధవారం నుండి రాబోయే ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
పది రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు
పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున, ఫిబ్రవరి మొదటి వారంలో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాన సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ట్రోపోస్పిరిక్, పశ్చిమ ప్రాంతంలో ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ఫలితంగా ప్రధానంగా ఆగ్నేయం,తూర్పు నుండి తెలంగాణ వైపు తక్కువ స్థాయిలో చలి గాలులు వీస్తాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బుధవారం నుంచి రానున్న ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. ఫిబ్రవరి 2 నుండి 9 వరకు, చల్లని, బలమైన ఉత్తర గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఉత్తర, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 నుంచి 10°C కంటే తక్కువగా నమోదవుతాయి. ఇతర జిల్లాలలో 9 నుంచి 15°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హైదరాబాద్‌లో కూడా 9 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనికితోడు బలమైన చలిగాలులు వీస్తాయి. ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీల మధ్య, బలమైన ఈశాన్య శీతల గాలుల కారణంగా ఉష్ణోగ్రత తగ్గుతుంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రోబేయే పది రోజుల పాటు పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట, ఉదయం 8 గంటల లోపు బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారు, గుండెజబ్బులు ఉన్న వారు చలిలో బయటకు వెళ్లవద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపే వారికి పొగమంచు ప్రధాన సమస్యగా ఉంది. తెల్లవారుజామున, ఉదయం రహదారులపై మంచు ప్రభావంతో వీక్షణ తగ్గే అవకాశం ఉంది. అందుకే వాహనాలు నడిపే వారు చాలా నిదానంగా ప్రయాణం చేయడం మంచిది. అతివేగం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cold wave, Hyderabad, Local News, Telangana