తెలంగాణ(Telangana) ట్రాఫిక్ పోలీసులు (Traffic police)పెండింగ్ చలాన్లు చెల్లించని వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పేరుకుపోయిన ఈ చలాన్లను క్లియర్ చేసేందుకు వాహనదారులకు ఓ అవకాశాన్ని ఇచ్చారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లకు క్యాటగిరి ప్రకారం రాయితీ ఇచ్చారు. పెండింగ్ చలాన్లు(E challans) డిస్కౌంట్ (Discount)పద్దతిలో చెల్లించుకునేందుకు సుమారు 45రోజులు గడువు ఇచ్చారు. ఈ ఐడియా పోలీసులకు బాగానే వర్కవుట్ అయినప్పటికి కేవలం 70శాతం పెండింగ్ చలాన్లు మాత్రమే క్లియర్ అయ్యాయి. అంటే ట్రాఫిక్ నిబంధలు(Trafic rules) ఉల్లంఘించిన మరో 30శాతం మంది వాహనదారులు చలాన్లు కట్టకుండా వదిలేశారు. ఈ విషయంపైనే తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికి పెండింగ్ చలాన్లు చెల్లించని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. చలాన్లు చెల్లించకుండా తిరుగుతున్న వారు పట్టుబడితే వారిపై (Police Cases)కేసులు నమోదు చేయబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు. అంతే కాదు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికి వరకు వాహనదారులు చలాన్లు చెల్లించేందుకు ప్రత్యేక రాయితీ ఇచ్చారు. ఆ గడువును పొడిగించి మరికొందరికి ఊరట కలిగించారు. అయినప్పటికి మరో 30శాతం చలన్లు పెండింగ్‌లో ఉండటంతో ఇప్పుడు కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే ఇప్పటిక వరకు 3కోట్ల ట్రాఫిక్ చలాన్లు క్లియర్ అయ్యాయి. వాటి ద్వారా సర్కారుకు సుమారు వెయ్యి కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇక మిగిలిన 30శాతం చలాన్ల ద్వారా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి మరో 700కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. క్లియర్ అయిన పెండింగ్ చలాన్లలో 70శాతం టూవీలర్స్ ఉన్నాయి. 65శాతం కార్లపై ఉన్న చలాన్లు క్లియర్ అయినట్లుగా అధికారులు వెల్లడించారు.
చలాన్లు చెల్లించకపోతే కేసులే..
వాహనదారులకు ఇచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం ఉపయోగించుకోకపోవడం వల్లే అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు వాహనదారులారా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోండి లేదంటే వాహనాలతో పాటు మీరు కటకటాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.
వాహనదారులకు స్ట్రాంగ్ వార్నింగ్..
పోలీసులు అంటేనే ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్, యాక్షన్ అనే మూడు సూత్రాలను పాటిస్తారు. అలాంటిది పెండింగ్ చలాన్ల విషయంలో ఇప్పటి వరకు కాస్త సావధానంగా వ్యవహరించిన పోలీసులు ఇకపై వాళ్లు చెప్పినట్లుగా కేసులు నమోదు చేయడం మొదలుపెడితే పెండింగ్ చలాన్ల సంగతి పక్కన పెట్టండి..కొత్త కేసుల్లోంచి బయటపడలేక వాహనదారులే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని మర్చిపోకండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.