హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Police: తెలంగాణ వాహనదారులకు వార్నింగ్..48గంటల తర్వాత..

Telangana Police: తెలంగాణ వాహనదారులకు వార్నింగ్..48గంటల తర్వాత..

(మిగిలింది 48గంటలే..)

(మిగిలింది 48గంటలే..)

Telangana Police: తెలంగాణలో ఈ చలాన్లపై రాయితీ గడువు మరో 48గంటల్లో ముగుస్తుంది. ఇంకా ఈ చలాన్లు చెల్లించని వారు వెంటనే కట్టకపోతే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సుమారు నెల 15రోజుల పాటు ఇచ్చిన అవకాశాన్ని ఇంకా పొడిగించే ప్రసక్తి లేనట్లుగా అధికారులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

నెలలు, రోజులు అవకాశం ముగిసింది. ఇక మిగిలింది గంటలే. తెలంగాణ(Telangana)లోని వాహనదారులారా మేల్కొనండి. మరో రెండ్రోజులు గడిస్తే ..తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు(Traffic police) ఇచ్చిన ఈ చలాన్ల(E challans) రాయితీ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న మొత్తం డబ్బులు తప్పని సరిగా చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు సైతం ముక్కు పిండి వసూలు చేస్తామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా (corona)ముందు నుంచి వేర్వేరు వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌(Trafic rules) ఉల్లంఘించడం, వాహనాల ధృపత్రాలు(No documents) లేకుండా నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) చేసి పట్టుబడటం ఇలా అనేక రకాల కారణాలతో కోట్లాది మంది వాహనదారులు కోట్లాది రూపాయలు తెలంగాణ ట్రాఫిక్ పోలీస్‌శాఖకు బాకీ పడ్డారు. వాటిని క్లియర్ చేసి ప్రభుత్వానికి ఆదాయం, వాహనదారులకు ఊరట ఇచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన బంపర్ ఆఫరే రాయితీ(Discount) ప్రస్తుతం వాహనాలపై ఉన్న ఈ చలాన్ల మొత్తంలో కేవలం 70శాతం రాయితీ ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ మొదట్లో నెల రోజుల వరకు మాత్రమే ఉంది. మార్చి 1వ తేది నుంచి 31వరకు గడువు ఇచ్చారు అధికారులు. అయితే క్లియర్ అయిన చలాన్లతో పాటు పెండింగ్‌లో కూడా అంతే సంఖ్యలో ఉండటంతో మరో 15రోజుల రాయితీ గడువును పెంచారు. ఇక ఇప్పుడు ఆ టైమ్‌ కూడా పూర్తి కావస్తోంది. శుక్రవారం(Friday)తో గడువు ముగుస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల్ని మరోసారి అలర్ట్ చేస్తున్నారు.

కొన్ని గంటలు మాత్రమే..

ఇప్పటి వరకు ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేసిన వారి సంఖ్య 2.9 కోట్లకు చేరుకుంది. అంటే రాయితీ ఇవ్వడం కారణంగా పెండింగ్‌లో ఉన్న చలాన్ల ద్వారా ప్రభుత్వానికి నెల 10రోజుల వ్యవధిలోనే దాదాపు 292 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే మరో వంద కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్న మాట. పెండింగ్‌ చలాన్ల సంఖ్య కూడా భారీగానే ఉండటంతో అధికారులు మరోసారి అప్రమత్తం చేస్తున్నారు. గతంలో చలాన్ల చెల్లించేందుకు కుంటి సాకులు, పైరవీలతో సరిపెట్టుకున్నారు. అయితే రాయితీ ఇచ్చినప్పటికి క్లియర్ చేయకపోతే వాహనదారులకు ఈ రెండ్రోజుల గడువు ముగిసిన తర్వాత పెండింగ్‌ చలాన్లను అంతే సీరియస్‌గా రాయితీ లేకుండానే వసూలు చేస్తామంటున్నారు. కాబట్టి త్వరపడండి వాహనదారులారా. మేల్కొనపోతే ఇప్పుడున్న చలాన్లకు మూడింతలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

నిర్లక్ష్యం చేస్తే తప్పదు భారీ మూల్యం..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఈ రెండ్రోజుల్లో ఆన్‌లైన్‌లో లేదంటే మీ సేవా కేంద్రాల్లో ఈ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు అధికారులు. ఇక టూవీలర్‌, ఆటోలపై 75శాతం, కార్లు, హెవీ వెహికల్స్‌పై 50శాతం, ఆర్టీసీ బస్సులకు 70శాతం, కరోనా టైమ్‌లో మాస్క్‌లు లేకుండా డ్రైవింగ్ చేసి వారికి 90శాతం డిస్కౌంట్ ఇచ్చారు పోలీసులు. ఈ సదావకాశాన్ని రెండ్రోజుల్లో ఉపయోగించుకోకపోతే నష్టపోయేది మీరేనంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

First published:

Tags: Hyderabad Traffic Police, Telangana

ఉత్తమ కథలు