హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad:మిగిలింది నాలుగు రోజులే..ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే

Hyderabad:మిగిలింది నాలుగు రోజులే..ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే

Hyderabad:పేరుకుపోయిన పెండింగ్‌ చలాన్లు రాయితీ వర్తింపు 4రోజులే టైముందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కోటిన్నరకు పైగా చలాన్లు క్లియర్ అయినప్పటికి ఇంకా లక్షల్లో కేసులు పెండింగ్‌ ఉండటంతో వాటిని రికవరీ చేసుకునేందుకు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...

తెలంగాణలోని వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన సదావకాశం మరో నాలుగు రోజుల్లో ముగిసిపోనుంది. వెహికల్‌పై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు(Traffic challans)డిస్కౌంట్‌(Discount)తో చెల్లించడానికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు (Telangana Traffic Police)మార్చి 31వరకు గడువు ఇచ్చారు. అది మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. రాయితీ వర్తింపు గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోలేకపోతే తర్వాత భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. మీరు ఊళ్లో లేకపోయినా సరే..ఆన్‌లైన్లో అయినా చెల్లించమంటున్నారు. తెలంగాణలో పెండింగ్ చలాన్ల రూపంలో ట్రాఫిక్ పోలీసులకు సుమారు 400కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఆ లెక్కలు తేలకపోవడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ( Hyderabad Traffic Police)బకాయి చలాన్లు వసూలు చేసుకునే పేరుతో వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మార్చి(March)1వ తేది నుంచి మార్చి 31లోగా చలాన్లు క్లియర్ చేసే వాళ్లకు రాయితీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కేవలం 26రోజుల వ్యవధిలో ట్రై కమిషనరేట్‌ల పరిధిలోనే కోటిన్నరకుపైగా చలాన్లు క్లియర్ అయ్యాయి. ఇన్ని చలాన్లకు 150కోట్ల రూపాయలుపైగా ప్రభుత్వ ఖజానాలో జమా అయింది.

లేట్ చేస్తే మీకే లాస్..

ట్రాఫిక్ పోలీసుల ప్లాన్ వర్కవుట్ కావడంతో మిగిలిన చలానాలను కూడా మిగిలిన 4 రోజుల్లోనే వసూలు చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. అందులో భాగంగానే చలానాలను క్లియర్ చేసుకోమని వాహనదారులకు విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత ప్రస్తుతం ఉన్న చలానాలకు రాయితీ ఇవ్వమని పూర్తి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

నాలుగు రోజులే డిస్కౌంట్‌..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వాహనాల శ్రేణిని బట్టి డిస్కౌంట్స్‌ ఇచ్చారు. ఇందులో టూవీలర్, ఆటోలకు 75శాతం రాయితీ ఇవ్వడం జరిగింది. బస్సులకు 70శాతం, తోపుడు బళ్లకు 80శాతం, కార్లకు 50పర్సంటేజ్‌ చొప్పున రాయితీ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ అవకాశం కూడా ఈనెలాఖరువరకే ఉంటుందని మరీ మరీ హెచ్చరిస్తున్నారు. చలాన్ల చెల్లింపులను మీ సేవాతో పాటు , ఈ వ్యాలెట్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. కరోనా టైమ్‌లో ఆ తర్వాత మాస్కులు ధరించని కేసులకు 90శాతం రాయితీ ప్రకటించారు. కొంతలో కొంత వసూలు అయినప్పటికి ఇంకా లక్షల సంఖ్యలో వాహనదారులు పెండింగ్‌ చలాన్లు ఉన్నట్లుగా ప్రకటించారు.

First published:

Tags: Hyderabad, Telangana, Traffic challan

ఉత్తమ కథలు