HYDERABAD TELANGANA STATE MINISTER KTR INSPECTED THE DESIGN OF THE 125 FOOT BRONZE STATUE TO BE SET UP AT TANK BUND AND SAID THE STATUE WOULD BE LAUNCHED BY DECEMBER PRV
Ambedkar Statue: ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. ఆ నెలలో ప్రారంభిస్తామన్న మంత్రి కేటీఆర్ ..
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)
ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసే 125 అడుగుల కాంస్య విగ్రహ నమూనాను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ట్యాంక్ బండ్ (Tank Bund )పై 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహన్ని (Ambedkar Statue) ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు రూ. 1400 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబందించి ప్రభుత్వం జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. అయితే ఈ జీవో విడుదలై చాలా రోజులు గడిచినా విగ్రహం పనులు పూర్తవలేదు. దీంతో అటు ప్రతిపక్షాలు ఇటు దళిత సంఘాలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహం ఏర్పాటుకపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ (Tank Bund )పై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహన్ని (Ambedkar Statue) ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసే 125 అడుగుల కాంస్య విగ్రహ నమూనాను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో అంబేడ్కర్ విగ్రహం తయారు అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ విగ్రహం తయారీని ప్రజా ప్రతినిధులు పరిశీలించనున్నట్టుగా కేటీఆర్ చెప్పారు. ప్రపంచంంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహంగా చరిత్ర సృష్టించనుందని కేటీఆర్ చెప్పారు.
ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ..
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పమే ఈ విగ్రహం అన్నారు కేటీఆర్.. దేశ ప్రజలకు ఇదొక కానుక.. అంబేద్కర్ ఆశయాలు పూర్తి స్థాయిలో అమలు కావాలన్నారు.. ఆర్ధిక అసమానతలకి తావు లేకుండా దేశ ప్రజలు అందరు బాగుపడాలన్నారు కేటీఆర్. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే వారికి అంబేడ్కర్ ఆదర్శమన్నారు కేటీఆర్. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణను సాధించుకున్నామని మంత్రి గుర్తు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు పనులు పూర్తయ్యాయన్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని మాటల్లో కాదు చేతల్లో తమ ప్రభుత్వం చూపుతుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టుగా కేటీఆర్ చెప్పారు.
దళిత బంధు పథకానికి రూ. 17,700 కోట్లు..
అంతకుముందు జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో రెండే రెండు కులాలున్నాయన్నారు. ఒకటి డబ్బున్న కులం, మరోటి డబ్బు లేని వారి కులం అని కేటీఆర్ చెప్పారు. దళిత బంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 17,700 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. దళిత బంధు పథకంపై కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విపక్షాలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. సమస్యలు ఏమున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.రైతు బంధు, రైతు భీమా, టిఫ్రైడ్ పథకాలు ఓ చరిత్ర అని ఆయన చెప్పారు. 10 మందికి అవకాశాలను కల్పించే వ్యక్తులు ప్రోత్సహించాలని కేటీఆర్ చెప్పారు.
అంబేడ్కర్ విగ్రహంతో పాటు అంబేడ్కర్ పార్క్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహం 125 అడుగుల ఎత్తు ఉంటుంది. విగ్రహం వెడల్పు 45.5 ఫీట్లు ఉంటుంది.ఈ విగ్రహం ఏర్పాటుకు గాను 791 టన్నుల స్టీల్ ను ఉపయోగించనున్నారు. అంతేకాదు 96 మెట్రిక్ టన్ను ఇత్తడిని ఉపయోగించనున్నారు. ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహలను ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఇందులో భాగంగానే అంబేడ్కర్ విగ్రహన్ని 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.