పదో తరగతి పరీక్షల (Tenth Exam date 2022) షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Telangana SSC Board) విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలు మే 11, 2022న ప్రారంభం కానున్నాయి. చివరి పరీక్ష మే 20, 2022తో ముగియనుంది. గత రెండు సంవత్సరాలలో తెలంగాణలో కరోనా కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో పరీక్షలు లేకుండానే (Without Exams) తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను ప్రమోట్ చేసింది. అయితే తాజాగా కోవిడ్ పరిస్థితులు అనుకూలించడంతో పరీక్షలను నిర్వహించడానికి బోర్డ్ మొగ్గు చూపింది. మరోవైపు థర్డ్ వేవ్ కూడా ముగిసిందని ఇటీవలె వైద్యారోగ్య శాఖ సంచాలకులు సైతం ప్రకటన చేయడంతో ఇక పరీక్షలకు అడ్డంకి లేకుండా పోయింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ (Tenth Exam date 2022) ను బోర్డు విడుదల చేసింది.
పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్..
* 11-05-2022 ఫస్ట్ లాంగ్వేజ్ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.
* 12-05-2022 సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.
* 13-05-2022 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.
* 14-05-2022 మ్యాథమెటిక్స్ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.
* 16-05-2022 జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.
* 17-05-2022 సోషల్ స్టడీస్ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.
* 18-02-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1, (సంస్కృతం, అరబిక్) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.
* 19-05-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.
* 20-05-2022 ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ కోర్స్ (థియరీ) ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది.
కాగా, తెలంగాణ (Telangana) ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ (Inter Practical Exams)కి సంబంధించి ఇటీవలె కీలక ప్రకటన చేసింది. ఇంటర్ విద్యార్థులకు (Inter Stuents) మార్చిలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల కాలేజీల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు (Inter Practical Exams) ఉంటాయని వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం ప్రాక్టికల్ పరీక్షలు (Inter Practical Exams) నిర్వహించి, త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది.
కాగా, గతేడాది కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ వర్క్ అసైన్‌మెంట్స్ (Home work Assessment) ప్రాక్టికల్‌గా ఇచ్చారు. ఇప్పుడు కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడం, కాలేజీలో తిరిగి తెరుచుకోవడంతో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలలో అసైన్‌మెంట్ల ద్వారా విద్యార్థులకు మార్కులను అంచనా వేస్తారని అధికారులు తెలిపారు.
విద్యార్థులకు అసైన్‌మెంట్ (Assignments)లు ఇవ్వడం జరుగుతుందని, వాటిని ఇళ్ల వద్ద పూర్తి చేసి, కాలేజీల్లో సబ్‌మిట్ చేయాలన్నారు. ఇదిలాఉంటే.. మే లో పబ్లిక్ ఇగ్జామ్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు (Inter board) ఏర్పాట్లు చేస్తోంది.70 శాతం సిలబస్ ఆధారంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పరీక్ష పత్రంలోనూ కీలక మార్పులు ఉంటాయంటున్నారు. విద్యార్థులకు ఎక్కువ ఆప్షనల్ ప్రశ్నలు ఉండేలా ప్రశ్న పత్రం రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, Hyderabad, Ssc exams, Tenth class