తెలంగాణలో (Telangana) ఇప్పటికే అన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అధికారులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో వెలుగులోకి వచ్చిన ఘటనతో తీవ్ర కలకలంగా మారింది. స్థానికంగా సరూర్ నగర్ లో (Saroor nagar) ఉన్న గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు అత్యంత అమానవీయకర పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం బయటపడింది. అక్కడ సుమారు 700 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కానీ అక్కడ కేవలం ఒక్క వాష్ రూమ్ మాత్రమే ఉందని, విద్యార్థినులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా కాలేజ్ లో కేవలం నలభై నిముషాల ఉంటే లంచ్ బ్రేక్ లో మిగతా సమయాలలో బాత్రూంకు వెళ్దామన్న, కొన్ని సార్లు లైన్ లో గంటల తరబడి ఉండాల్సి ఉంటుందని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. అంతే కాకుండా.. బాత్రూం దీనవస్థ కారణంగా కొన్నిసార్లు పీరియడ్స్ రాకుండా కూడా ట్యాబ్లెట్ లు కూడా వేసుకుంటున్నట్లు సమాచారం.
అంతమంది విద్యార్థినులకు కేవలం ఒక్క టాయ్ లేట్ ఏవిధంగా సరిపోతుందని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. గతంలోను ఇదే వ్యవహరంపై స్టూడెంట్స్ నిరసనలు చేపట్టారు. అప్పుడు మంది సబితా ఇంద్రారెడ్డి వచ్చి విద్యార్థులకు, బాత్రూమ్ లు నిర్మిస్తామన్నారు. కానీ ఆ హమీ ఇప్పటి వరకు నిరవేరలేదని విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు
కాగా, న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న మనీదీప్ అనే స్టూడెంట్.. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, సమగ్రంగా దానిపై లేఖను తెలంగాణ హైకోర్టుకు రాశారు. దీంతో కోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించింది. అంతే కాకుండా.. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వెంటనే దీనికి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డుకు కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపి, ఏప్రిల్ 25లోగా పూర్తి నివేదిక ఇవ్వలంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Sabita indra reddy, Telangana