(Balakrishna, News 18)
ప్రభుత్వ తాగునీటి పథకం మిషన్ భగీరథ.. వాటర్ బోర్డు (Water Board)కు ఎంత చెల్లించాలో తెలిస్తే షాక్ అవుతారు. తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మంగా తీసుకొచ్చిన ప్రభుత్వ తాగునీటి పథకం మిషన్ భగీరథ హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా మురుగునీటి బోర్డు (HMWSSB)కి 601.32 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన RTI లో విషయం వెలుగులోకి వచ్చింది. మిషన్ భగీరథకు బకాయిలతో ఇప్పుడు వాటర్ బోర్దు లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వంలో ఇతర విభాగాలైన రెవెన్యూ శాఖ వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ శాఖలు మరియు ఏజెన్సీల నుండి 1,519 కోట్లు బకాయిలు వాటర్ బోర్డు కు పెండింగ్ ఉన్నాయి. ఇందులో 1,267 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి 252 కోట్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు 233.69 కోట్లు, ప్రభుత్వ రంగ యూనిట్లు 18.15 కోట్లు , హైదరాబాద్ వాటర్ బోర్డు కు రావాల్సి ఉంది. అయితే బకాయిలు చెల్లింపుకు సంబంధించి తాము నిత్యం లేఖలు రాస్తూనే ఉన్నామని అయినప్పటటికి సంబంధిత డిపార్ట్మెంట్స్ నుంచి ఎటువంటి స్పందన లేదని అంటున్నారు వాటర్ బోర్డు అధికారులు.
ఈ బకాయిల్లో శాఖలవారీగా చూస్తే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 539.63 కోట్లు, ఆరోగ్య, వైద్య, కుటుంబ, సంక్షేమ శాఖకు 41.70 కోట్లు, పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ 18.13 కోట్లు, గృహనిర్మాణ శాఖ 22.33 కోట్లు, హోం శాఖ 14.56 కోట్లు, సాధారణ పరిపాలన శాఖ 9.40 కోట్లు, రవాణా, రోడ్లు, భవనాల శాఖలు 7.11 కోట్లు వాటర్ బోర్డుకు బకాయిలు ఉన్నాయి.
RTI ప్రకారం నివేధిక ప్రకారం.. బకాయిలను క్లియర్ చేయమని ప్రభుత్వ శాఖలకు గుర్తు చేస్తూ చివరిసారిగా 17 జూన్ 2021న నోటీసులు వాటర్ బోర్డు అధికారులు పంపించినట్లు తెలుస్తోంది. "మేం అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రతి నెలా బిల్లును జారీ చేస్తాము. అయితే ఈ బిల్లులను కొన్ని సందర్భల్లో ప్రభుత్వ శాఖలు ఒకేసారి చెల్లిస్తాయి . కొన్నిసార్లు 3-4 నెలలకు ఒకసారి. కాని గత కొద్ది రోజులుగా ఎన్ని సార్లు ఎన్ని లేఖలు రాసినప్పటికి బిల్లులు చెల్లింపుకు సంబంధించి సరైన స్పందన రావడం లేదని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక HMWSSB అధికారి న్యూస్18 కి తెలిపారు. GHMC చట్టంలోని సెక్షన్ 199 ప్రకారం, ఆస్తి పన్నులో నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, లైటింగ్ పన్ను, పరిరక్షణ పన్ను మొదలైనవి ఉంటాయి.
ఒక పౌరుడు GHMCకి ఆస్తి పన్ను (ఇంటి పన్ను) చెల్లించినప్పుడు, అతను నీరు మరియు పారుదల పన్ను కూడా చెల్లించినట్లు అందులో ఉంటుంది. . మళ్ళీ, నీటి బోర్డు విడిగా నీరు, నీటి పారుదల పన్నును వసూలు చేస్తుంది. అయితే సామాన్యుడు ఒక నెల పెండింగ్ పెడితేనే వచ్చిన కనెక్షన్ కట్ చేసే అధికారులు ప్రభుత్వ సంస్థలు కొట్ల రూపాయిలు పెండింగ్ పెట్టినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే కొద్ది రోజల్లో వాటర్ బోర్డు నష్టాల్లోకి వెళ్లడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC, Hyderabad, Mission Bhagiratha, Water