హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila-PK: షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీం భేటీ.. వైఎస్ఆర్‌టీపీకి వ్యూహకర్తగా పీకే..!

YS Sharmila-PK: షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీం భేటీ.. వైఎస్ఆర్‌టీపీకి వ్యూహకర్తగా పీకే..!

ఫైల్ ఫొటోలు

ఫైల్ ఫొటోలు

YS Sharmila-PK: తెలంగాణ రాజకీయలో శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిల.. ఇందుకోసం సొంతంగా వైఎస్ఆర్‌టీపీ(YSRTP)పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2023 లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. తమ పార్టీ అధికారంలోకి రావాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(PK) టీమ్ సలహాలు తీసుకోవాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణ(Telangana) రాజకీయలో శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిల.. ఇందుకోసం సొంతంగా వైఎస్ఆర్‌టీపీ(YSRTP)పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2023 లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. తమ పార్టీ అధికారంలోకి రావాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(PK) టీమ్ సలహాలు తీసుకోవాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. కిషోర్ గతంలో ఆమె సోదరుడు , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దాని ద్వారా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. అంతేకాకుండా.. బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మరియు ఇటీవల తమిళనాడులో ప్రభుత్వాల ఏర్పాటులో వ్యూహకర్తగా ప్రధాన పాత్ర పోషించారు.

  Assembly Session: నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆరు బిల్లులు ఇవే..


  ఇదిలా ఉండగా.. రాజకీయాల్లో రాణించేందుకు.. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ సలహాలు తీసుకోవాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె పీకే టీమ్‌తో సమావేశమయ్యారు. పాదయాత్రకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ అంశాలపై షర్మిల వారితో చర్చించినట్టు సమాచారం. అయితే షర్మిల ఈ సంవత్సరం జూలై 8 న తన రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ముందు కిశోర్‌తో సంప్రదింపులు జరిపారు. పార్టీ ప్రకటించడానికి ముందే కిషోర్ సన్నిహితురాలైన ప్రియా రాజేంద్రన్, ద్రవిడ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే ఆర్. రాజేంద్రన్ కుమార్తె వైఎస్ షర్మిల కు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు.. పార్టీ కోసం వ్యూహాలను రూపొందించడంలో ప్రియా చాలా సహాయపడిందని.. కొన్ని రోజుల కిందట నుంచే పార్టీ బలోపేతం కోసం పీకే టీం పనిచేయడం ప్రారంభించిందని వైఎస్ఆర్టీపీ నాయకుడు ఒకరు తెలిపారు.

  TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎండీ సజ్జనార్‌ కీలక నిర్ణయం.. ఏంటంటే..


  కొన్ని నెలలుగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో నిరుద్యోగ దీక్షలు చేపడుతున్న వైఎస్ షర్మిల.. అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి షర్మిల తన పాదయాత్రను ఎంచుకున్నారు, అదే ప్రదేశం నుండి ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003 లో తన పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. దాని ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. షర్మిల రోజుకు 12-15 కిలోమీటర్లు నడవాలని నిర్ణయం తీసుకున్నారు. తన ప్రయాణంలో.. ఆమె ప్రజలు కష్టాలను తెలుసుకొని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఏడు సంవత్సరాల్లో ప్రజలు ఏం కోల్పోయారో వివరించనున్నారు.

  Huzurabad By Elections: హుజురాబాద్ లో ఊపందుకోనున్న ప్రచారం.. అభ్యర్థుల బలాలు.. బహీనతలు ఇవే..


  అయితే దీనిపై ఇంకా సమగ్రంగా ప్రజల్లోకి ఎలా వెళ్లాలి ? ప్రజా సమస్యలపై ఏ రకంగా పోరాడాలి ? ప్రజల దృష్టిని తమ వైపు ఎలా తిప్పుకోవాలి ? అనే అంశంపై వైఎస్ షర్మిల దృష్టి పెట్టారు. రాజకీయాల్లో రాణించేందుకు.. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ తో హైదరాబాదులోని లోటస్ పాండ్ కార్యాలయంలో షర్మిలతో సుదీర్ఘంగా చర్చించింది.

  Minor Girl: సమోసా కొనిస్తానని నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే.. వరి పొలంలో ఆ బాలిక నగ్నంగా..


  పాదయాత్రకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ అంశాలపై షర్మిల వారితో చర్చించినట్టు సమాచారం. వీరితో చర్చల అనంతరం మరోసారి ఆమె స్వయంగా ప్రశాంత్ కిశోర్‌తో చర్చించే అవకాశం ఉందని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చలను బట్టి తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ టీమ్ వైఎస్ షర్మిల పార్టీ కోసం పని చేయబోతున్నట్టు స్పష్టత వచ్చినట్టే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగి షర్మిల పార్టీ కోసం పని చేస్తే.. వైఎస్ఆర్‌టీపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తులగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొని వైఎస్ఆర్‌టీపీ నిలబడుతుందా.. లేదా అనేది చూడాలి.

  Published by:Veera Babu
  First published:

  Tags: Prashant kishor, YS Sharmila

  ఉత్తమ కథలు