TDP-BJP: తెలంగాణ (Telangana) లోని వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP)తో కలిసి బీజేపీ (BJP) పోటీ చేస్తుందా..? ఇటీవల ఖమ్మం (Khamam)లో టీడీపీ సభ తరువాత ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. టీడీపీ-బీజేపీ పొత్తు ఫిక్స్ (TDP-BJP Allaince) అయ్యిందని.. ఎవరికి ఎన్ని అంటూ లెక్కలపైనే చర్చలు సాగుతున్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. దీంతో బీజేపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లోనే దీనిపై కన్ఫ్యూజ్ నెలకొంది. తెలుగు దేశం (Telugu Desam) తో పొత్తు ఉంటుందా..? ఉండదా అంటూ.. తమకు అందుబాటులో ఉన్న నేతలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా బీజేపీ సమావేశంలో దీనిపై నేరుగా పార్టీ నేతలే రాష్ట్ర అధ్యక్షుడ్ని ప్రశ్నించారు. మాజీ ఎంపీ విజయశాంతి (Vijayasanthi) నేరుగా దీనిపై బండి సంజయ్ నే ప్రశ్నించారు..
కలుగజేసుకున్న ఎంపీ అర్వింద్ సైతం దీనిపై క్లారిటీ ఇవ్వడమే మంచిది అని.. బండి సంజయ్ ను కోరినట్టు తెలుస్తోంది. తరువాత మాట్లాడిన విజయశాంతి మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు సమాచారం.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘరంగా భంగపడిందని.. ఇప్పుడు టీడీపీతో పొత్తు అంటే.. బీజేపీ శ్రేణుల్లోనే అవే భయాలు ఉన్నాయని విజయశాంతి అధిష్టానంపై ఇలా ప్రశ్నల వర్షం కురిపించినట్టు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే దీనిపై నేరుగా మాట్లాడిన బండి సంజయ్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదు అన్నారు. ఇదే విషయాన్ని ప్రజలు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నేతలపై ఉందని అభిప్రాయపడ్డారు. నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లే నేతలంతా టీడీపీతో పొత్తు లేదు అన్నదానిపై గట్టిగానే చెప్పాలని ఆయన సూచించారు.. దీంతో టీడీపీ-బీజేపీ పొత్తు వార్తలకు ఇక బ్రేక్ పడినట్టే..
ఇదీ చదవండి : తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్
అయితే మరో వర్గం మాట్రం కచ్చితంగా పొత్తు ఉంటుందని.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది బండి సంజయ్ కాదని.. కేంద్ర పెద్దలు దీనిపై ప్రకటన చేస్తారని చెబుతున్నారు. బీజేపీ క్లారిటీ ఎలా ఉన్నా..? తెలుగు దేశం నేతలు మాత్రం పొత్తు ఉంటుందనే ధీమాతో ఉన్నారు. ఖమ్మం సభ తరువాత వారిలో కాన్ఫిడెన్స్ మరింత కనిపిస్తోంది. త్వరలోనే నిజామాబాద్ , కరీం నగర్ ల్లోనూ సభను నిర్వహించే కసరత్తు చేస్తోంది టీడీపీ.. అక్కడ కూడా బలనిరూపణ చేసుకుంటే.. బీజేపీ అధిష్టానం కచ్చితంగా పొత్తుకు ముందుకు వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Bandi sanjay, Chandrababu Naidu