మన దేశంలో ఫోర్నగ్రఫీ సైట్లను బ్యాన్ చేశారు. అయితే నిషేధం ఉన్నప్పటికీ.. కొందరు దొంగచాటుగా అడల్ట్ కంటెంట్‌ని ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు. ఇలాంటి వారిపై ఇప్పుడు తెలంగాణ పోలీస్ అధికారులు నిఘా పెట్టారు. అశ్లీల వీడియోల్ని చూస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. జైల్లోకూడాపెడుతున్నారు. చైల్డ్ పోర్న్ వీడియోలు, ఫోటోలు చూసేవారిని, సెర్చ్ చేసే వారిని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 43 మందిని అరెస్ట్ చేశారు. బాలల లైంగిక వేధింపు అంశాలను, వీడియోలను, ఫొటోలను సర్క్యూలేట్ చేసేవారిపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) టిప్‌లైన్స్ ఆధారంగా నిఘా పెట్టారు.
తెలంగాణ పోలీసులు చైల్డ్ పోర్న్ వీడియోలు, ఫోటోలు చూసేవారిని, సెర్చ్ చేసే వారిని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పీడోఫైల్స్ అంటే పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ కలిగి ఉండటం అనే మనస్తత్వం ఉన్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ స్వభావం ఉన్న వారు సోషల్ మీడియా, యాప్‌లు, వీడియో గేమ్స్ ద్వారా పిల్లలతో స్నేహం పెంచుకొని.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఓ రిపోర్ట్ ప్రకారం.. కరోనాకి ముందు 2018లో మన దేశంలో ప్రతిరోజూ 110 మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యేవారు.
లాక్‌డౌన్ సమయంలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ కు ఆన్‌లైన్‌లో 200 నుంచి 250 శాతం వరకు డిమాండ్ పెరిగినట్టు తేలిసింది. టెలిగ్రామ్ మాధ్యమంగా ఈ సీశామ్ కంటెంట్ బాగా వైరల్ అవుతోంది. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ సీశామ్ కేసుల్లో అరెస్టయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు విద్యార్థులు కూడా చైల్డ్‌పోర్నోగ్రఫీకి అలవాటు పడుతున్నట్టు గుర్తించారు.
అయితే మన దేశంలో ఇలాంటి కంటెంట్ చూడటం షేర్ చేయడం చట్టవిరుద్ధం. అందుకే ఎవరైనా సరే... ఇలాంటి నేరాలకు పాల్పడితే... కఠిన శిక్షలు తప్పవు. సెక్షన్ 67(బి), ఐటీ చట్టం 2000 ప్రకారం శిక్షలు వేస్తారు. ఇంటర్నెట్‌లో ఎవరు చూడరు కదా ఆ కంటెంట్ చూస్తే.. తప్పకుండా జైలుపాలు అవుతారు. ఇలాంటి కేసుల్లో అన్ని ఫోన్ల ఐపీ అడ్రస్‌లు జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోలీసులకు తెలిసిపోతాయి. ఒకవేళ ఈ కేసుల్లో నేరం రుజువు అయితే.. ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Telangana Police