• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD TELANGANA PEOPLE SUFFERING OF CM KCR BEHAVIOR BJP STATE PRESIDENT BANDI SANJAY SAID VRY

Hyderabad : తెలంగాణ ఎందుకు ఏర్పాటైందని ప్రజలు భాదపడుతున్నారు..బండి సంజయ్

బండి సంజయ్, సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటోలు)

Hyderabad : అమర వీరుల ఆశయాలు కొనసాగించాలంటే బిజెపి అధికారంలోకి రావడం వల్లే సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన మరోసారి సీఎం కేసిఆర్ పై మండిపడ్డారు.

  • Share this:
అమర వీరుల ఆశయాలు కొనసాగించాలంటే బిజెపి అధికారంలోకి రావడం వల్లే సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన మరోసారి సీఎం కేసిఆర్ పై మండిపడ్డారు.

తెలంగాణ అమరవీరుల ఆశయాలు రావాలంటే బిజెపీ అధికారం రావడంతోనే సాధ్యం అవుతుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసిఆర్ వ్యవహరాశైలితో తెలంగాణ ఎందుకు వచ్చిందని భాదపడే పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆయన పార్టీ కార్యాలయంలో జెండా అవిష్కరణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఆయన విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో సీఎం కేసిఆర్ ఇచ్చిన హామిలను మరోసారి గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు.సీఎం కేసిఆర్ ఇచ్చిన హామిల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు..కేసిఆర్ కుటుంబం తప్ప తెలంగాణ ఏర్పాటు తర్వాత చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ కాలంలో కేసిఆర్ వెంట ఎవ్వరు ఇప్పుడు లేరని అన్నారు. భౌగోలిక తెలంగాణ ఏర్పాటైంది తప్ప ఇంకా సామాజిక తెలంగాణ రాలేదని మరో నేత విజయశాంతి అన్నారు.ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ముందుగా బిజెపికే వచ్చిందని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలు వెంటిలేటర్ పై ఉన్నాయని చెప్పారు. ఇక మొత్తం రాష్ట్ర పాలన గాఢి తప్పిందని , అదుపులోకి రావాలంటే బిజేపి అధికారంలోకి రావడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్ర సమస్యలపై కరోనా ఉదృతి తగ్గిన తర్వాత పోరాటం కొనసాగిస్తామని అన్నారు.
Published by:yveerash yveerash
First published: