HYDERABAD TELANGANA MINISTER KTR TWEETED HE WILL HELP A GIRL WHO IS WALKING 2 KILOMETERS TO SCHOOL WITH ONE LEG IN BIHAR SNR
Telangana : బీహార్ బాలికకు కేటీఆర్ హామీ .. తెలంగాణ మంత్రి చేస్తానన్న సాయం ఏంటో తెలుసా
(Photo Credit:Twitter)
Telangana: ఆ అమ్మాయికి బాగా చదువుకుని డాక్టర్ కావాలనే కోరిక. కాని అందరికి ఉన్నట్లుగా ఆమెకు రెండు కాళ్లు లేవు. ఒక్క కాలుతోనే రెండు కిలోమీటర్ల దూరం ఉన్న స్కూల్‌కి గెంతుతో వెళ్తోంది. బాలిక పడుతున్న ఇబ్బందిని మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ తాను సహాయం చేస్తానంటూ ట్వీట్ చేశారు. బాలిక వివరాలు పంపమని ట్వీట్లో పేర్కొన్నారు.
పదేళ్ల వయసు దాటిన పిల్లలు జింక పిల్లలా చెంగు చెంగున గెంతులేస్తుంటారు. కాని బీహార్(Bihar)కి చెందిన 11సంవత్సరాల ప్రియాన్షు(Priyanshu)కి ఆ అదృష్టం లేదు. వికలాంగురాలు (Disabled)కావడంతో బాలికకు ఒకే కాలు ఉంది. అలాగే ఒంటికాలుతోనే తన ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల(2kilometers) దూరంలో ఉన్న స్కూల్(School)కి వెళ్లి వెళ్తోంది. నడవటానికి రెండో కాలు లేకపోవడంతో ఒక్క కాలుతోనే గంతులు వేస్తూ వెళ్తోంది. బాగా చదువుకోవాలనే ఆమెలోని పట్టుదలే ఆమెలోని అవయవలోపాన్ని జయించి ధైర్యంగా చదువుకుంటోంది.
పట్టుదలే ఆమె బలం..
బీహార్ రాష్ట్రం సివాన్ జిల్లాలోని బంటుశ్రీరామ్ గ్రామానికి చెందిన ప్రియాన్షు ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కి వెళ్లి వస్తోంది. అయితే తాను ఒకే కాలుతో గంతులేస్తూ స్కూల్‌కి వెళ్లడం ఇబ్బందిగా ఉంటోంది. అలాగే రోజూ స్కూల్‌కి ఆలస్యం అవుతోందని బాలిక వాపోతోంది. తండ్రి మజ్దూర్ పని చేసుకొని కుటుంబాన్ని పోషించడంతో కృత్రిమ కాలు అమర్చే ఆర్దిక స్తోమత లేక అలాగే స్కూల్‌కి వెళ్తోంది ప్రియాన్షు. తన సమస్యను జిల్లా అధికారులో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎలాగైనా తనకు కృత్రిమ కాలు అమర్చాలని వేడుకుంది.
If someone at @ANI can me the girl’s contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0
చదువుల తల్లి..
ప్రియాన్షు పడుతున్న ఇబ్బందిని మీడియా ద్వారా చూసిన తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆమె ఆవేదనను, అవసరాన్ని అర్ధం చేసుకున్నారు. బాలికకు అవసరమైన సహాయం తాను చేస్తానంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు. ప్రియాన్షు వివరాలు తనకు తెలియాలని ట్వీట్ చేశారు. బాలిక ఒంటికాలితో గెంటుతూ స్కూల్‌కి వెళ్తున్న వీడియోని ట్యాగ్ చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడమే కాకుండా తాను సహాయం చేస్తానంటూ పెద్ద మనసు చాటుకున్నారు.
ఒంటి కాలుతో రెండు కిలోమీటర్లు..
ప్రభుత్వం తన బాధను అర్ధం చేసుకొని కృత్రిమ కాలు అమర్చితే బాగా చదువుకొని డాక్టర్ని అవుతానంటోంది. తన భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న ప్రియాన్షుకి ప్రభుత్వం లేదంటే పాలకులు ఆమె కోరినట్లుగా కృత్రిమ కాలు అమర్చాలని తమ బిడ్డ బాగా చదివి డాక్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యతోనే బీహార్‌లోని జమూయ్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఒంటి కాలితో కిలో మీటర్ దూరమున్న స్కూల్‌కి వెళ్లి వస్తున్న వార్తను చూసి నటుడు సోనుసూద్ చలించిపోయారు. ఆమెకు అవసరమైన సాయం చేస్తానని ట్విట్టర్ వేదికగా మాటిచ్చారు. సోనుసూద్ బాలికకు భరోసా ఇచ్చిన తర్వాత జిల్లా అధికారులు సైతం ఆమెకు ట్రై సైకిల్ని ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.