Home /News /telangana /

HYDERABAD TELANGANA MINISTER KTR SHARED PHOTO WITH GUNTUR COLLEGE FRIENDS ON TWITTER SNR

Photo Viral: గుంటూరు కాలేజీ ఫ్రెండ్స్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. ఫోటో వైరల్

Photo Credit:Twitter

Photo Credit:Twitter

Photo Viral:ఆయన తెలంగాణ మంత్రిగా ఉన్నప్పటికి కాలేజీ రోజుల్ని మర్చిపోలేదు. పాతికేళ్ల క్రితం తనతో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్‌ని రీసెంట్‌గా కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేసి తన స్వీమ్‌ మెమోరీస్‌ని అందరితో పంచుకున్నారు.

ఇంకా చదవండి ...
వ్యక్తులు ఏ స్ధాయిలో ఉన్న వాళ్లకంటూ కొన్ని తీపి గుర్తులు ఉంటాయి. స్కూల్‌ డేస్, కాలేజీలో చదువుకున్న రోజులు, ఒకే చోట ఉద్యోగం చేసిన సమయంలో ఉన్న సాన్నిహిత్యం ఇలా అనేక సందర్భాలు జీవితంలోని కొంత సమయం ఓ మధురజ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. తెలంగాణ(Telangana)ఐటీశాఖ మంత్రి (Minister)కేటీఆర్‌(KTR)కి అలాంటి స్వీట్‌ మెమోరీస్‌(Sweet Memories)ఉన్నాయని రీసెంట్‌గా సోషల్ మీడియా (Social media)లో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ తీపిజ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోనే వైరల్ అవుతోంది. కేటీఆర్ గతంలో గుంటూరుGunturuలో చదివిన విషయం చాలా మందికి తెలుసు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు విజ్ఞాన్‌(Vignan) సంస్థకు చెందిన వడ్లమూడి క్యాంపస్‌ (Vadlamudi Campus)లో ఆయన ఇంటర్‌ మీడియట్ చదివారు. ఇది గడిచి దాదాపు పాతికేళ్లకుపైగా అయిపోయింది. కాని ఆనాటి తన ఫ్రెండ్స్, కాలేజీ స్నేహితులను ఇప్పుడు కలుసుకోవడంతో నాటి జ్ఞాపకాల్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్(Twitter) ద్వారా నెమరవేసుకున్నారు. విజ్ఞాన్‌లో చదివిన సమయంలో తన బ్యాచ్‌మెట్స్‌ని రీసెంట్‌గా కలిశారు మంత్రి కేటీఆర్‌. ఈసందర్భంగా వాళ్లంతా కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫోటోని షేర్ చేయడంతో పాటు విద్యార్ధి దశగా ఉన్న సమయంలో పొందిన అనుభూతిని అందరితో షేర్ చేసుకున్నారు. కాలేజీలో చదువుకున్న రోజులు తొందరగా ఎవరూ మర్చిపోరు. ఎందుకంటే ఆ దశలోనే స్టూడెంట్ అనే వాడు చాలా విషయాలు తెలుసుకుంటాడు కాబట్టి. తన పాతమిత్రుల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌.

గుర్తుకొస్తున్నాయి..
ఇంకా గొప్ప విషయం ఏమిటంటే..తాను ఓ సీఎం కొడుకుగా, రాష్ట్ర మంత్రిగా, ఓ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నప్పటికి పాత మిత్రులను కలుసుకోవడం ఎల్లప్పుడూ ప్రత్యేకమేనని ట్వీట్‌లో పేర్కొనడం విశేషంగా చెప్పుకోవాలి. ట్వీట్‌లో కేసీఆర్‌ ఈవిధంగా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. విజ్ఞాన్‌ వడ్లమూడి క్యాంపస్‌లో తనతో చదివిన 1991-93 బ్యాచ్‌మెట్స్‌ని కలవడం హ్యాపీగా ఉందన్నారు. అయితే అప్పటి తన స్నేహితుల్లో చాలా మంది డాక్టర్లు ఉన్నారని..28ఏళ్ల తర్వాత కలవడంతో కాలం ఎంతో వేగంగా గడిచిపోయినట్లుగా ఉందన్నారు కేటీఆర్. కాని తన స్నేహితుల్ని చూసిన తర్వాత కొన్ని వారాల క్రితమే విజ్ఞాన్‌ వడ్లమూడి క్యాంపస్‌లో చదువుకున్నామనే ఫీలింగ్ కలుగుతోందని తన స్వీట్‌మెమోరీస్‌ని షేర్ చేసుకున్నారు. తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకున్నారు.

ఎంత ఎదిగినా..
కేటీఆర్‌ అంటే చాలా హుందాగా, ఫ్రెండ్లీగా వ్యవహరించే నాయకుడని పేరుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సమస్యల్ని తన దృష్టికి తీసుకెళ్తే దాన్ని చిటికెలో పరిష్కారిస్తాని అందరికి తెలుసు. ఏపీ రెండుగా విడిపోయినా..ఆయన తనతో సాన్నిహిత్యం కలిగిన వాళ్లను మర్చిపోరని..వాళ్ల ఏ స్థాయి వ్యక్తులైనా సోదరభావం, స్నేహబంధాన్ని కొనసాగిస్తారని ఆయన చేసిన ట్వీట్‌ని చూసి సోషల్ మీడియా ఫాలోవర్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Minister ktr, Telangana, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు