హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR|Viral news : ఇండిగో ఫ్లైట్‌లో తెలుగు ప్రయాణికురాలికి అవమానం .. మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా..?

KTR|Viral news : ఇండిగో ఫ్లైట్‌లో తెలుగు ప్రయాణికురాలికి అవమానం .. మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా..?

ktr tweet(Photo Credit:Twitter)

ktr tweet(Photo Credit:Twitter)

KTR | Viral news: ఇండిగో ఫ్లైట్‌లో ఓ తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. భాషలు రాలేదన్న కారణంతో ప్రయాణికుల్ని అవమానించడం సరికాదన్నారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే వారినే ఆయా రూట్లలో సిబ్బందిగా నియమించుకోవాలని ఇండిగో యాజమాన్యానికి సూచించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇండిగో ఫ్లైట్‌(Indigo flight)లో ఓ తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) ట్విట్టర్‌(Twitter) వేదికగా స్పందించారు. ఈనెల 16వ తేదిన విజయవాడ (Vijayawada)నుంచి హైదరాబాద్‌(Hyderabad)కు వస్తున్న మహిళను కేవలం హిందీ, ఇంగ్లీష్‌(English) భాష రాదనే కారణంతో విమానంలో ఆమె సీటు మార్చడాన్ని తప్పు పడుతూ ట్విట్టర్‌లో ఓ ప్రొఫెసర్ చేసిన ట్వీట్‌ని మంత్రి ఖండించారు. ఇండిగో సిబ్బందిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడటం రానంత మాత్రాన వాళ్లను అవమానపరచడం సరికాదన్నారు. ప్రయాణికులను గౌరవించాలని సూచించారు. విమానాలు ప్రయాణించే రూట్స్ ఆధారంగా ప్రాంతీయ భాష మాట్లాడ గలిగే సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు మంత్రి. ఇప్పుడు ఈ వార్తే తెగ వైరల్ అవుతోంది. ఇండిగో విమాన సర్వీసు సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

NIA Raids: ఆదిలాబాద్​లోనూ ఎన్​ఐఏ సోదాలు.. వచ్చింది ఆ వ్యక్తిని పట్టుకునేందుకేనా?

ఎందుకీ వివక్ష..

మూడ్రోజుల క్రితం ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించిన ఓ తెలుగు మహిళకు జరిగిన అవమానం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సదరు తెలుగు మహిళ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు జర్నీ చేస్తుండగా ఇండిగో సిబ్బంది ఆమెకు హిందీ, ఇంగ్లీష్ రాదనే కారణంతో ఫ్లైట్‌లో సీటు మార్చారు. వాస్తవంగా ఆమె సీటు 2ఏ(ఎక్స్ఎల్ సీటు, ఎగ్జిట్ రో)లో ఆమె కూర్చోని ఉండగా.. ఇండిగో సిబ్బంది ఆమెను 3సీ సీట్లోకి మార్చేశారు. ఇదే విషయాన్ని అహ్మదాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ దేవస్మిత ఫోటోని షేర్ చేస్తూ ట్విట్టర్‌లో ఇండిగో విమాన సర్వీసు సిబ్బంది తీరును విమర్శించారు. ఎందుకింత వివక్ష అంటూ ప్రశ్నించారు.

అవమానించడం సరికాదు..

సదరు మహిళ ఇండిగో సిబ్బంది చూపించిన సీటులోనే కూర్చొని జర్నీ పూర్తి చేసుకొని హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ వ్యవహారం ఆలస్యంగా బయటకు రావడంతో పెద్ద చర్చ జరుగుతోంది. ఇండిగో విమానంలో తెలుగు ప్రయాణికురాలికి ఎదురైన అవమానకర ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేస్తూ.. ఇక నుంచైనా స్థానిక భాషలు మాత్రమే మాట్లాడగలిగిన ప్రయాణికులను కూడా గౌరవించాలని సూచించారు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడలేని ప్రయాణికుల్ని కూడా గౌరవించాలన్నారు. విమానాలు ప్రయాణించే రూట్ల ఆధారంగా ఆయా భాషలు మాట్లాడగలిగే సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. అలా అయితే ప్రయాణికులకు, సిబ్బందికి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.

ట్విట్టర్‌లో అభిప్రాయాలు..

తెలుగు ప్రయాణికురాలికి జరిగిన అవమానంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వేర్వేరుగా స్పందిస్తున్నారు. భద్రతా కారణాలతోనే ఇండిగో సిబ్బంది ఇలా చేసివుంటారని పలువురు నెటిజన్లు విమాన సిబ్బందికి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ప్రయాణికురాలికి అండగా మద్దతిస్తూ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఈమొత్తం వ్యవ్యహారంపై ఇప్పటి వరకు ఇండిగో యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.

Published by:Siva Nanduri
First published:

Tags: Minister ktr, Telangana News

ఉత్తమ కథలు