Home /News /telangana /

HYDERABAD TELANGANA MINISTER KTR RESPONDED TO THE CRITICISM OF JUBILEE HILLS GANG RAPE CASE INVESTIGATION PRV

Jubilee hills gang rape case| KTR: జూబ్లీహిల్స్​ గ్యాంగ్​ రేప్​​ కేసులో నిందితులకు బెయిల్​పై స్పందించిన మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

అమ్నీషియా పబ్‌ గ్యాంగ్​ రేప్​ నిందితులకు కోర్టు ఇటీవలె బెయిల్ ఇచ్చింది. అప్పట్లో కేసు విచారణపై విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మే 28న హైదరాబాద్​లోని (Hyderabad) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలిక (17)ను కొందరు మైనర్లు ఇంటి వద్ద దించుతామని నమ్మించి కారులో తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన విదితమే. ఈ కేసు (Jubilee hills gang rape case) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా నిందితుల తల్లిదండ్రులకు హై ప్రొపైల్​ ఉండటంతో చాలామంది ఈ కేసు విచారణపై (Case Investigation) అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వారంలో నిందితులను పట్టుకుని విచారణ అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు పోలీసులు. కాగా, ఇటీవలె నిందితులకు కోర్టు బెయిల్​ (Bail) ఇచ్చింది. ఈ ఘటనల నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విట్టర్​లో స్పందించారు.

    అయితే ఈసారి సోషల్​ మీడియా బ్యాచ్​కి కేటీఆర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌ (Hyderabad)లో జరిగిన అత్యాచారం కేసులో (Rape Case) తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించే వెర్రి ట్రోలర్స్​కు ఇదే జవాబంటూ ఆయన స్పందించారు. రేపిస్టులను వేగంగా అరెస్టు చేసి జైలుకు పంపింది తెలంగాణ ప్రభుత్వమని  (Telangana Govt) కేటీఆర్​ ట్విటర్​లో తెలిపారు. 45 రోజుల తర్వాత హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని, ఈ రేపిస్టులను చట్ట ప్రకారం శిక్షించే వరకు పోరాడుతామని అని తెలిపారు.



    ‘‘జువెనైల్ జస్టిస్ యాక్ట్, IPC & CrPCలోని లొసుగుల ఫలితంగా రేపిస్టులు బెయిల్ పొందారు.అందుకే ఈ చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నా.  ఏ రేపిస్ట్‌కు బెయిల్ రాకుండా , దోషిగా తేలినప్పుడు మరణించే వరకు జైలులోనే ఉండాలి. అదే నిజమైన జీవిత ఖైదు’’గా కేటీఆర్ అభివర్ణించారు.



    మరోవైపు బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ (Gang Rape) దోషులను.. రెమిషన్‌ ఆదేశాల కింద గుజరాత్‌ ప్రభుత్వం (Gujarat Government) విడుదల చేయడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుండగా.. విపక్షాలు, మేధోవర్గం ఈ విషయంలో గుజరాత్‌ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఏకీపడేస్తున్నాయి. ఈ క్రమంలో.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ (Minister KTR)​ సైతం ట్విటర్‌ వేదికగా స్పందించారు.

    ‘‘ప్రియమైన మోదీ గారు .. మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడడం నిజమే అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకోండి. పదకొండు మంది రేపిస్టులను (Rapists) విడుదల చేసిన గుజరాత్‌ ప్రభుత్వపు ఆదేశాలను రద్దు చేయించండి. ఈ ఆదేశాలు వెగటు పుట్టించేవిగా ఉన్నాయి. మీరు జోక్యం చేసుకుని చిత్తశుద్ధి చూపించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు కేటీఆర్‌. అంతేకాదు.. సార్‌.. ఐపీసీ (IPC), సీఆర్‌పీసీలో (CRPC) రేపిస్టులకు బెయిల్‌ దొరక్కుండా ఉండేందుకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, బలమైన చట్టాలతోనే న్యాయవ్యవస్థ పటిష్టంగా, వేగంగా పని చేస్తుందని మరో కొనసాగింపు ట్వీట్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారు .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hyderabad, Jubilee Hills Gang rape case, KTR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు